మెట్రోరైలు విస్తరణ ఆర్థికంగా భారం

20 Sep, 2014 19:08 IST|Sakshi
శ్రీధరన్

విజయవాడ: మెట్రోరైలు నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని ఏపి మెట్రో రైల్ ప్రాజెక్టుల ప్రధాన సలహాదారు శ్రీధరన్ చెప్పారు. విజయవాడలో  మెట్రోరైల్ నిర్మాణ ప్రదేశాలను ఈరోజు ఆయన పరిశీలించారు. కానూరు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బస్టాండ్ వరకు ఒక మెట్రో రూట్, రామవరప్పాడు నుంచి బస్టాండ్ వరకు మరో రూట్ను పరిశీలించారు. తొలిదశలో విజయవాడలో ఈ రెండు రూట్లలో  మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంది. తొలివిడత 30 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంది.  ప్రాథమికంగా కొన్ని కారిడార్లపై శ్రీధర్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. మెట్రో-పర్యావరణంపై కూడా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్క కిలోమీటర్కు మెట్రోరైల్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు.  జనవరి నాటికి చివరి నివేదిక సమర్పిస్తారు. విజయవాడ-మంగళగిరి ప్రాంతాలను కూడా ఆయన మెట్రోరైలు కోసం పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ మెట్రోరైలు గుంటూరు వంటి ప్రాంతాలకు విస్తరించడం ఆర్థిక భారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో మెట్రో ప్రాజెక్టు ఉండవచ్చునన్న అభిప్రాయం శ్రీధర్ వ్యక్తం చేశారు. భౌగోళిక పరిస్థితులను కూడా పరిశీలించి అంచనాలను తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్మాణం ప్రారంభించవచ్చునని శ్రీధరన్ తెలిపారు.
**

మరిన్ని వార్తలు