కాదేదీ కబ్జాకు అనర్హం..!

2 Jul, 2019 07:46 IST|Sakshi
ఆక్రమణకు గురైన చింతాడ పుట్టోడి చెరువు

సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : కబ్జాకు కాదేదీ అనర్హం అంటూ గట్టు, పుట్ట, శ్మశానం, ఆఖరికి చెరువులు కూడా కబ్జా చేస్తూ ఆక్రమణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. వీటిలో అధికంగా పక్కపక్కనే సాగు చేస్తున్న రైతులు ఉండగా, కొన్ని చెరువులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేశారు. కొందరు కబ్జా చేసి ఇతరులకు సాగుకు అందించి తమ సత్తా చాటుకుంటున్నారు. చెరువుల్లో 50 శాతం పైగా కబ్జా జరిగినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు తహసీల్దార్లు ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా కబ్జాలు ఆగడం లేదు. ముందుగా రైతులతో కబ్జా చేస్తుండడంతో ఈ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కూడా కొంత మేర ఆక్రమణలకు కారణం అవుతుండగా, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో వారికి అవగాహన లేకపోవడం, వీఆర్వోలు సరిగ్గా పట్టించుకోకపోవడం, గ్రామస్తులతో వివాదాలు లేదా గ్రామాల్లో వివాదాలతో తమకు ఎందుకు వివాదం అన్న ధోరణిలో వెళ్తుండడం కొంతమేర కబ్జాలకు కారణం అవుతున్నాయి. 

కబ్జా బారిన పడిన చెరువుల వివరాలు..
బొబ్బిలి మండలంలో చింతాడలో పుట్టోడి చెరు వు, నారప్పచెరువు, పిరిడిలో పోలవానిచెరువు, అలజంగిలో సీతారామ సాగరం, దాలెందర చెరువు, మెట్టవలసలో మల్లమ్మచెరువు, కృష్ణాపురంలో రంగం చెరువు, ఎర్రచెరువు, గొర్లెసీతారాంపురంలో రాయుడిచెరువు, కోమటపల్లిలో నారయ్యచెరువు ఇలా ప్రతీ గ్రామంలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇలా అన్ని మండలాల్లోని గ్రామాల్లో పలు చెరువులు ఆక్రమణ బారిన పడ్డాయి. గతంలో రైతులు పంటలు వేసుకునేందుకు ఆక్రమించుకోగా ఇప్పుడు నాయకులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు.

కబ్జాకోరల్లో చెరువులు..
ఇదివరలో రైతులు పంటలకోసం కక్కుర్తి పడి చెరువు గర్భాలు ఆక్రమించుకునే వారు. ఇప్పుడు అలా కాకుండా దళారీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జాలు చేస్తున్నారు. చెరువులు, పంట కాలువలు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కబ్జాలపై చర్యలు చేపట్టాలి.
– బొమ్మి అప్పలనాయుడు, రైతు, పెంట

రైతులు ఇబ్బంది పడుతున్నారు..
చెరువులు కబ్జా చేస్తుండడంతో రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. చెరువులను కబ్జాచేసి వీఆర్వోల సహాయంతో రికార్డులు తారుమారు చేస్తున్నారు. సీతయ్యపేటలో ఓ వీఆర్వో బినామీగా చెరువు కబ్జా చేశాడు. సుప్రీం కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదు. అక్రమణదారులపై చర్యలు చేపట్టాలి.
– వేమిరెడ్డి లక్ష్మణ్‌ నాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బొబ్బిలి.

నోటీసులు ఇస్తున్నాం..
అనేక చెరువులు కబ్జాలో ఉ న్నట్లు తెలు స్తోంది. మా వీఆర్వోలు స మాచారం  తెలి పిన వెంటనే నోటీసులు ఇస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా నోటీసులు ఇస్తున్నాం. చర్యలు చేపడుతున్నాం. అనేకమంది ఆక్రమణ దారులకు గతంలో తహసీల్దార్‌లు  నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుం టున్నాం.        
– ఏ.సింహాచలం, తహసీల్దార్, బొబ్బిలి.

నియోజకవర్గంలో చెరువుల విస్తీర్ణం, కబ్జా వివరాలు.. 

మండలం   చెరువుల సంఖ్య    సాగువిస్తీర్ణం  కబ్జా(సుమారుగా)
బొబ్బిలి 356 1,550 ఎకరాలు    50ఎకరాలు
తెర్లాం   460   1,000ఎకరాలు    30ఎకరాలు
బాడంగి 320  935ఎకరాలు     10ఎకరాలు
రామభద్రపురం 266   870ఎకరాలు  12ఎకరాలు

 


 

మరిన్ని వార్తలు