హామీలు తుంగలో తొక్కిన సీఎం

13 Sep, 2014 02:43 IST|Sakshi
హామీలు తుంగలో తొక్కిన సీఎం

పోరుమామిళ్ల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్‌ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు గోవిందరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ సమావేశాలపైన ఆయన మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ కుటుంబాన్ని విమర్శించేందుకే సగం సమయం వృథా చేశారన్నారు. బడ్జెట్ సామాన్యులకు మేలు చేసేదిగా లేదన్నారు. రైతురుణ మాఫీపై నేటికీ స్పష్టత లేదన్నారు. డ్వాక్రా రుణాలు, బంగారు తాకట్టు రుణాల్లో  మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో సభలో చర్చించి అందరి ఆమోదంతో ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. అది ప్రజల రాజధాని కాదని, రియల్ ఎస్టేట్ రాజధాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. ప్రజలకు మేలుచేసే అంశాలను సభలో చర్చించలేదని పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. సాఫ్ట్‌వేర్ పేరుతో 850 ఎకరాలు రహేజాకు కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు.  
 సమస్యల పరిష్కారానికి పోరు
 సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడతామని ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దొరికినకాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో పార్టీ  మండల కన్వీనర్ ఇమామ్‌హుసేన్, ఎస్సీ సెల్ జిల్లా  కార్యదర్శి ముత్యాల ప్రసాద్, మండల నాయకులు రవిప్రకాష్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు