గోదావరీ తీరంలో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు

6 May, 2015 19:14 IST|Sakshi

అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక సమీపంలో గోదావరి తీరాన కొండుకుదురులంక ద్వీపంలో గ్యాస్ నిక్షేపాలు విరివిగా ఉన్నట్లు ఆయిల్ ఇండియా సంస్థ తన అన్వేషణలో గుర్తించింది. గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసేందుకు నాబార్స్ అనే అంతర్జాతీయ డ్రిల్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే కృష్ణా గోదావరి బేసిన్‌లో ఓఎన్జీసీ, రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ, గెయిల్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు ఆన్‌షోర్, ఆఫ్ షోర్ కార్యకలాపాల ద్వారా చమురు, సహజ వాయువులను వెలికితీస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు