8 నుంచే ఒక్కపూట బడి

2 Mar, 2016 07:12 IST|Sakshi
8 నుంచే ఒక్కపూట బడి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈయేడాది ఎండల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఒంటిపూట బడులను ముందుగానే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాని విద్యాశాఖ కమిషనర్ ఆర్‌పీ సిసోడియా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మామూలుగా అయితే ప్రతి ఏడాది మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేవారు. ప్రభుత్వం నిర్ణయంపై బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషయ్య, సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు