అటవీ భూముల నజరానా

23 Apr, 2015 01:11 IST|Sakshi
అటవీ భూముల నజరానా
  • జగ్గీ వాసుదేవ్‌కు కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధం
  • వాటి విలువ సుమారు రూ.వెయ్యికోట్లు
  • సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో కోట్లాది రూపాయల విలువైన అటవీ భూముల్ని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌కు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనపురం ప్రాంతంలోని 400-500 ఎకరాల అటవీ భూమిని ఇందుకు ఎంపిక చేయడం వెనుక మతలబేంటన్న విషయంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా జగ్గీ వాసుదేవ్‌ను తీసుకొచ్చి ఈ భూములను చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    అత్యంత విలువైన భూములు..
    ఈ ప్రాంతంలో ఎకరం పొలం విలువ నాలుగు నెలల క్రితం వరకూ రూ.50 నుంచి రూ.60 లక్షలు ఉండేది. తుళ్లూరు రాజధాని ప్రకటన తర్వాత దాదాపు రూ.కోటి నుంచి కొన్నిచోట్ల రెండు కోట్లకూ చేరింది. ఆ ప్రకారం.. ఈషా ఫౌండేషన్‌కు కట్టబెట్టే భూముల విలువ రూ.వెయ్యి కోట్లకు పైమాటే.  ఈ ప్రాంతంలో మొత్తం ఆరువేల ఎకరాల అటవీ భూములుండగా అందులో 1,500 ఎకరాల్లో వనసంరక్షణ సమితిలున్నాయి.మూలపాడు, త్రిలోచనపురం, కేతనకొండ, జూపూడి, దొనకొండ గ్రామాలకు చెందిన పేదలు వెదురు, జామాయిల్‌ను ఈ భూముల్లో పెంచి జీవనం సాగిస్తున్నారు. ఈ భూములు జగ్గీవాసుదేవ్ చేతిలోకి వెళితే వారందరి ఉపాధికి గండి పడినట్లే. కేంద్రం అనుమతితో ఈ భూముల్ని డీనోటిఫై చేయాల్సివుంది. కేంద్రంతో దీనిపై సంప్రదించకుండానే జగ్గీవాసుదేవ్‌కు భూములిచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం గమనార్హం.
    అడవిపైనే ఆధారపడ్డాం..
    20 సంవత్సరాల నుంచి అడవినే నమ్ముకుని జీవిస్తున్నాం. గతంలో భూములు బాగు చేసుకుని సాగు చేసుకోమన్నారు. వాటిని తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ భూముల్ని బాగు చేసుకుని వెదురు, జామాయిల్ వేశాం. వీటిని తీసేసుకుంటే మేమెక్కడికి వెళ్లాలి.     - అనసూర్య, త్రిలోచనపు
     

మరిన్ని వార్తలు