మహిళా ఉద్యోగిపై...

2 Aug, 2019 09:40 IST|Sakshi
వివాదంపై ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్న డీఎస్‌ఓ 

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా పౌరసరఫరా శాఖా కార్యాలయంలో అసిస్టెంట్‌ పౌరసరఫరాల అధికారిగా పని చేస్తున్న పీతల సురేష్‌ సహోద్యోగినిని అసభ్యకర పదజాలాలతో మాట్లాడడంతో గురువారం ఆమె బంధువులు పౌరసరఫరాల కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగారు. పౌరసరఫరాశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్‌ వివరాలు కావాలని ఏఎస్‌ఓ సురేష్‌ పలుమార్లు సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రసన్నజ్యోతిని అడిగారు. అయితే ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో బుధవారం ఆమెను అనేక సార్లు పిలిచినా ఆమె స్పందించలేదు. దీంతో సురేష్‌ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర పదజాలాలతో మాట్లాడినట్టు ఆమె తన బంధువులకు తెలిపింది.

గురువారం ఆమె బంధువులు, ఐద్వా మహిళానాయకురాళ్లు సివిల్‌సప్‌లైకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అసభ్యకరపదజాలాలతో మహిళలను వేధిస్తున్న సురేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి పి.ప్రసాదరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ఉద్యోగిని పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సురేష్‌తో ఆమెకు క్షమాపణ చెప్పించడంతో ఆందోళనకారులు శాంతిం చారు. ఒకనొక దశలో ప్రసన్నజ్యోతి బంధువులు సురేష్‌పై దాడికి ప్రయత్నించడంతో పలువురు అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖా కార్యాలయంలో జరిగిన ఆందోళన, తదితర విషయాలను డీఎస్‌ఓ ప్రసాదరావు జేసీ లక్ష్మీశ దృష్టికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు