ఇసుక రీచ్ బాటలకు భారీ గండ్లు

22 Nov, 2013 03:09 IST|Sakshi

సంగం, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు  అధికారులు నడుంబిగించారు. ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన జిల్లా యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా గురువారం రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో సంగం మండలంలో పలుచోట్ల ఇసుక రీచ్ బాటలకు భారీగా గండ్లు ఏర్పాటు చేశారు. తొలుత తహశీల్దారు శ్రీకాంత్ పెన్నానదిలో ఇసుక రీచ్‌లో తవ్విన భారీ గుంతలను పరిశీలించారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో సంగం ఇసుక రీచ్‌లో మూడు చోట్ల రోడ్డుకు అడ్డంగా ఐదు అడుగుల లోతులో యంత్రాలతో భారీ గండ్లు ఏర్పాటు చేశారు.
 
 ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ అధికారులతో ఇసుక అక్రమ తరలింపుపై చర్చించారు. అక్రమంగా ఒక్క ట్రాక్టర్ ఇసుక తరలినా టాస్క్‌ఫోర్స్ అధికారులదే బాధ్యత అన్నారు. ఇసుక తరలించే వాహనాలు ఎవరివైనా సరే సీజ్ చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు మండలంలోని సంగం, మక్తాపురం, అన్నారెడ్డిపాళెం గ్రామాల్లోని పెన్నానదిలో యంత్రాలతో భారీగా గండ్లు ఏర్పాటు
 
 చేశామన్నారు. ఇసుక రీచ్‌ల గండ్లను ఎవరైనా పూడ్చివేసి ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలింపు అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు రవికుమార్, వినోద్‌బాబు, స్పెషల్ పోలీసు తాళ్లూరి మోహన్ రావు, గిరిబాబు, ఆర్‌ఐ శివకుమార్, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.  
 
 చేశామన్నారు. ఇసుక రీచ్‌ల గండ్లను ఎవరైనా పూడ్చివేసి ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలింపు అడ్డుకునేం దుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు రవికుమార్, వినోద్‌బాబు, స్పెషల్ పోలీసు తాళ్లూరి మోహన్ రావు, గిరిబాబు, ఆర్‌ఐ శివకుమార్, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 ఇసుక రీచ్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
 ముత్తుకూరు : పిడతాపోలూరు సమీపంలో పలు ప్రాజెక్టులకు లారీల ద్వారా ఇసుకను తరలించే రీచ్‌ను గురువారం  టాస్క్‌ఫోర్సు అధికారుల బృం దం తనిఖీ చేసింది. టాస్క్‌ఫోర్స్ అధికారి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఇసుక రవాణాకు సంబంధించి సర్కారు ద్వారా పొందిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఇసుక రవాణాకు క్యూ కట్టిన లారీల వద్ద కూడా అనుమతి పత్రాలు తనిఖీ చేశారు. అయితే ఇసుక రవాణాకు సంబంధించి రీచ్ యజమాని వద్ద అనుమతులన్నీ ఉండడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు వెనుదిరిగారు.
 

మరిన్ని వార్తలు