దయ.. ‘తల్లి’చేదెవరు!

8 May, 2020 11:11 IST|Sakshi

అనంతపురం: నారాయణపురానికి చెందిన మహమ్మద్‌బీ అనే వృద్ధురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు మరణించగా.. కుమార్తెకు వివాహం చేసింది. తన వద్ద ఉండాలంటే నెలకు రూ.10వేలు ఇవ్వాలని అల్లుడు ఆదేశించాడు. పింఛను డబ్బులు ఇస్తానని చెప్పినా ససేమిరా అన్నాడు. విధిలేని పరిస్థితుల్లో ఓ మసీదులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా మసీదులో కూడా పని లేకపోవడంతో ఈ వృద్ధురాలు వీధిన పడింది. ఇదిగో ఇలా..చెత్తకుప్పల్లో దొరికింది తింటూ రోజులు భారంగా గడుపుతోంది. దయతలిచే ప్రభువులు ఎవరోనని దీనంగా రోదిస్తోంది.

కొమ్మ.. రెమ్మలా తోబుట్టువులు తన జీవితంలో ప్రతిరోజూ పండగే విధి కన్నుకుట్టి కొడుకూ దూరమయ్యాడు. కన్నకూతురే ఆధారం.. కాలధర్మం చేసే వరకూ కంటికి రెప్పలా..
కను‘పాపై’ చూసుకుంటుందనుకుందా.. అమ్మ   మహ‘అమ్మ’ద్‌బీ.. బీబీ చెంతకు చేరాలనుకుంది..

కంటేనే అమ్మ అనుకున్నాడో ఏమో.. అమ్మ..అత్తమ్మకు అం‘త్త’ దూరం ఉందనుకున్నాడేమో! బంధం మరిచాడు.. బంధుత్వాన్ని కాదన్నాడు ‘అ(ల్లు)తడు’ భార్య తల్లీ భారమైందతనికి
అమ్మతనం..ముసలితనమైంది..ఒంటరి జీవితం వెలితినిచ్చాయి..వృద్ధాప్యం ముంచుకొచ్చిందని  ‘ఉత్తి’మిరపలా ఉంటే  ముప్పొద్దులా గడవదని అనుకుంది..నిస్సహాయ స్థితిలోనూ మసీదులో చేతనైన పనిచేస్తుంటే..పూటగడిచేది ఆ ముదుసలికికరోన.. రూపంలో గడ్డు పరిస్థితి దాపురించిందిఅవసాన దశలో అన్నీ అల్లుడే అనుకుందిదయలేని అల్లుడు.. నిర్దయ చూపాడు..కనికరంలేని మనిషి.. కాదని బయటకు గెంటాడు చేవలేని వయసులో చేతనైన పని చేద్దామనుకున్నా..  కాలు బయటకు పెట్టేందుకు వీలుకాని పరిస్థితి..ఎటు వెళ్లాలనుకున్నా.. ‘లాక్‌’ పడింది చివరకు చెత్తకాగితంలా మారిందామె జీవితం..
దయార్ద్రహృదయులు దయతలిచి.. దరిచేర్చుకుంటే..మోడుబారిన మొదలుకు.. వసంత రుతువులో చిగురించి ని‘శ్చింత’గా  సాగిపోదా.. శేష‘జీవితం’ – ఫొటో: జి.వీరేష్‌

మరిన్ని వార్తలు