22న ఎంసెట్-2014

18 May, 2014 02:13 IST|Sakshi

- పరీక్ష రాయనున్న 14,186 మంది విద్యార్థులు
- గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

 
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 14,186 మంది పరీక్ష రాస్తుండగా.. వీరిలో 8,775 మంది ఇంజనీరింగ్, 5,411 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ విభాగంలో 150 మంది తగ్గగా, మెడికల్‌లో 700 మంది విద్యార్థులు పెరిగారు. కర్నూలు నగరంలో 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది. పరీక్షల నిర్వహణ రీజనల్ కో ఆర్డినేటర్‌గా జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డిని నియమించారు.
 
 మెడికల్,అగ్రికల్చర్ పరీక్ష కేంద్రాలు
 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల
 2. సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాల
 3. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ కళాశాల
 4. సెయింట్ జోసఫ్స్ స్కూల్
 5. మాంటిస్సోరి హైస్కూల్
 6. బృందావన్ కాలేజ్
 
 ఇంజనీరింగ్
 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల
 2. సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల(సుంకేసుల రోడ్డు)
 3. వాసవీ మహిళా కళాశాల(పెద్దమార్కెట్ వద్ద)
 4. జి.పులయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు
 5. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల
 6. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ స్కూల్, సుంకేసుల రోడ్డు
 7. శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల
 8. సెయింట్ జోసఫ్స్ జూనియర్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు
 9. ఉస్మానియ కళాశాల
 10. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల
 11. సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ స్కూల్, ఎన్‌ఆర్ పేట
 12. మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంప్
 13. బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సెన్సైస్(బిట్స్), చిన్నటేకూరు
 14. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్), బి.క్యాంపు
 
 విద్యార్థులకు సూచనలు, సలహాలు

 1. హాల్‌టికెట్‌లను విద్యార్థులు ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 2. విద్యార్థులు భర్తీ చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గజిటెడ్ ఆఫీసర్‌చే అటెస్టేషన్ చేయించాలి.
 3. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి బ్లాక్ /బ్లూ బాల్‌పాయింట్ పెన్, భర్తీ చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రాలు(జిరాక్స్ కాపీలు గజిటెడ్ ఆఫీసర్‌చే సంతకం తప్పనిసరి), ఎంసెట్-2014 హాల్‌టికెట్ తీసుకురావాలి.
 4. విద్యార్థులకు పరీక్ష హాలులోకి గంట ముందుగానే అనుమతిస్తారు.
 5. సెల్‌ఫోన్, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
 6. విద్యార్థులు తమ పేరు, తండ్రి పేరు, కేటగిరీలలో తప్పులు ఉంటే ముందుగానే నామినల్ రోల్స్‌లో సరిచేయించుకోవాలి.
 7. పరీక్ష ముగిసిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు, ఓఎంఆర్ షీటును ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి. పరీక్ష పత్రాన్ని వెంట తీసుకెళ్లొచ్చు.

>
మరిన్ని వార్తలు