23న చలో హైదరాబాద్ : వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

19 Sep, 2013 03:51 IST|Sakshi
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: కంప్యూటర్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించ తలపెట్టినట్లు  ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పలసూరి, జిఆదినారాయణలు తెలిపారు. బుధవారం ఎల్ బీజీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. 
 
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కనీస వేతనాలు లేకుండా కంప్యూటర్ పరిజ్ఞానం చెబుతున్న ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇకపై కంప్యూటర్ విద్యను ప్రభుత్వమే నిర్వహించాలని, లేని పక్షంలో రాజీవ్ విద్యామిషన్‌కు అమలు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. 
 
 ఇప్పటికైనా సర్కారు స్పందించి సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ టీచర్లంతా ఈనెల 22న బయలు దేరాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కె.సూర్యనారాయణ,రామారావు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు