ప్రేమించి మోసం చేసిన యువకుడిపై కేసు

6 Aug, 2013 00:45 IST|Sakshi

తూప్రాన్, న్యూస్‌లైన్ : ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసి, గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. తూప్రాన్ మండలంలోని యావపూర్‌కి చెందిన ఓ యువతి (19), అదే గ్రామానికి చెందిన నీలం శంకర్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సదరు యువతి గర్భం దాల్చింది.
 
 అయితే  యువతికి అబార్షన్ చేయించాలన్న శంకర్ ప్రయత్నం విఫలం కావడంతో అమ్మాయిని వారి ఇంట్లోనే వదలి వెళ్లాడు. మరుసటి రోజు (జూలై 30న) ప్రియుడు ప్రియురాలిని వెంటబెట్టుకుని రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌లో ఉన్న ఓ స్నేహితుడి ఇంటికి  తీసుకెళ్లాడు.  అక్కడ పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించి స్థానిక వైద్యుల సాయంతో అబార్షన్ అయ్యేందుకు మందులు ఇప్పించాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు అబార్షన్ చేసిన ఆస్పత్రికి వెళ్లి జరిగిన విషయమై ఆరా తీశారు. అనంతరం నీలం శంకర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా