4 నుంచి రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ సమీక్షలు

1 Jun, 2014 00:24 IST|Sakshi
4 నుంచి రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ సమీక్షలు
  •      తొలిరోజు అరకు.. పాడేరు
  •      6న మిగిలిన నియోజకవర్గాలు
  •      హాజరుకానున్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
  •  విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు ఈ నెల 4 నుంచి రాజమండ్రి కేంద్రంగా జరగనున్నాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో భాగంగా 4న రాత్రి 8 గంటలకు విశాఖలోని అరకు అసెంబ్లీ, 8.30 గంటలకు పాడేరు అసెంబ్లీ ఫలితాలపై పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చర్చించనున్నారు.

    మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై 6వ తేదీన సమీక్ష జరగనుంది. దీనికి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హాజరుకానున్నారు. గత ఫలితాలపై సమీక్షలో లోటుపాట్లు తెలుసుకోవడంతోపాటు, భవిష్యత్తులో పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.
     
    6వ తేదీ సమీక్ష  వివరాలు

     అనకాపల్లి పార్లమెంటు
      పాయకరావుపేట సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు
     యలమంచిలి సా.5.30 -6 వరకు
      నర్సీపట్నం సా.6 -6.30 వరకు
      అనకాపల్లి సా.6.30-రాత్రి 7.00
      పెందుర్తి రా.7 -7.30 వరకు
      మాడుగుల రా.7.30 - 8 వరకు
      చోడవరం రా.8- 8.30 వరకు
     విశాఖ పార్లమెంటు:
      ఎస్.కోట రా.8.30 -9 వరకు
      గాజువాక రా.9 -9.30 వరకు
      విశాఖ తూర్పు రా.9.30 -10
      విశాఖ దక్షిణం రా.10 -10.30  విశాఖ ఉత్తరం రా.10.30  -11  విశాఖ పశ్చిమం రా.11  -11.30  భీమిలి రాత్రి 11.30  నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు
     

మరిన్ని వార్తలు