రింగ్ అయ్యూరు!

29 Jun, 2014 02:06 IST|Sakshi
రింగ్ అయ్యూరు!

 విజయనగరం రూరల్ : మద్యం వ్యాపారులు మరోసారి రింగ్ అయ్యూరు. 2014-15 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 202 మద్యం దుకాణాలకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. శుక్రవారం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి జిల్లాలో 187 దుకాణాలకు దరఖాస్తులు రాగా 40 దుకాణాలకు ఒకొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి. దీంతో వ్యాపారులు రింగ్ అయినట్టు స్పష్టమైంది. దుకాణాల కేటాయింపునకు అధికారులు నిర్వహించే టెండర్లు, లాటరీ ప్రక్రియకు ముందే ఆయూ ప్రాంతాల్లోని వ్యాపారులు రహస్య సమావేశాలను నిర్వహించి సింగిల్ కోటేషన్‌తో టెండర్లను దక్కించుకున్నట్టు సమాచా రం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండిపడినట్టు స్పష్టమవుతుంది.
 
 ఏజేసీ ఆధ్వర్యంలో లాటరీ...
 లాటరీ ప్రక్రియను ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు సమక్షంలో శనివారం నిర్వహించారు. పార్వతీపురం డివిజన్ లో 66 మద్యం దుకాణాలుండగా 59 దుకాణాలకు 577 దరఖాస్తులు వచ్చాయి. విజయనగరం డివిజన్‌లో 136 మద్యం దుకాణాలుండగా 128 దుకాణాలకు 1002 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం డివిజన్‌లో ఏడు దుకాణాలకు, విజయనగరం డివిజన్‌లో ఎనిమిది దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. లాటరీ ప్రక్రియ లో మొదట సింగిల్ దరఖాస్తులు వచ్చిన దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించినట్లు ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు ప్రకటించారు. ముందుగా జిల్లాలోని 13 సర్కిల్ కార్యాలయాల పరిధిలోని షీల్డ్ బాక్సులను తెరిచి దరఖాస్తుదారులకు చూపించారు. అనంతరం విజయనగరం యూనిట్ పరిధిలోని సర్కిల్ కార్యాల యాల్లోని దుకాణాలకు లాటరీని నిర్వహించారు. లాటరీ లో దుకాణాలను దక్కించుకున్న వారికి ఏజేసీ  నాగేశ్వరరావు తాత్కాలిక లెసైన్సులను అందజేశారు.  
 
 గందరగోళంగా లాటరీ ప్రక్రియ
 మద్యం దుకాణాలకు శనివారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ గందరగోళంగా మారింది. పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన లాటరీ ప్రక్రియకు దరఖాస్తుదారులు పోటెత్తటంతో వారిని నియంత్రించటం అధికారులకు తలనొప్పిగా మారింది. 187 దుకాణాలకు 1580 మంది దరఖాస్తు చేసుకోగా వారందరూ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫంక్షన్ హాల్ చిన్నది కావటం అదే సమయానికి భారీ వర్షం కురవటం తో వారంతా హాల్‌లోకి చొచ్చుకొచ్చారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిం చి వారిని నియంత్రించారు.
 
 రూ.82 కోట్ల ఆదాయం
 జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా ప్రభుత్వానికి రూ.82 కోట్లకు పైబడి ఆదాయం లభించనుం ది. రూ. లక్షల శ్లాబ్ ఉన్న దుకాణానికి దరఖాస్తు రాలే దు. అలాగే రూ.32.5 లక్షల శ్లాబ్ ఉన్న 13 దుకాణాల కు, రూ.45 లక్షలు శ్లాబ్ ఉన్న దుకాణానికి దరఖాస్తులు రాకపోవటంతో రూ.4.32 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయూనికి గండి పడింది. 202 దుకాణాలు లాటరీలో వెళి తే ప్రభుత్వానికి రూ.86 కోట్ల ఆదాయం లభించనుంది.
 
 ధరఖాస్తు ఫీజు ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం
 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ఫీజు రూపంలో రూ.3.95 కోట్ల ఆదాయం లభించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది 202 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయగా 187 మద్యం దుకాణాలకు 1580 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల ఫీజు రూ.25 వేలు కాగా, 1580 దరఖాస్తులకు రూ.3.95 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి 202 మద్యం దుకాణాలకుగాను 190 దుకాణాలకు 1592 దరఖాస్తులు రాగా రూ.3.98 కోట్లు ఆదాయం లభించిందన్నారు. నూతన మద్యం విధానం ద్వారా జిల్లాలో  జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు నాలుగు శ్లాబ్‌లుగా విభజించారు. మొదటి శ్లాబ్‌లో రూ. 64లక్షలు కాగా, రెండవ శ్లాబ్‌లో రూ.45 లక్షలు, మూడవ శ్లాబ్‌లో రూ.36లక్షలు, నాల్గవ శ్లాబ్‌లో రూ. 32.5 లక్షలుగా నిర్ణయించటం జరి గిందన్నారు. దరఖాస్తులు రాని 15 మద్యం దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందన్నారు. మద్యం దుకాణాలు దక్కని దరఖాస్తుదారులు కలెక్టరేట్‌లోని ఈసీ కార్యాలయంలో ఈఎండీ డీడీలను సోమవారం తిరిగి పొందవచ్చునని ఆయన తెలిపారు.
 

 

మరిన్ని వార్తలు