ఆదాయం ఓకే.. సంక్షేమమేదీ?

16 Jan, 2014 04:39 IST|Sakshi

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చెందాలన్నా.. ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు రావాల న్నా.. పాలక మండళ్లు ఏర్పడాలన్నా వాటి నిర్వహణ సక్రమంగా ఉండాలి. అప్పుడే ఎక్కువ సంఖ్యలో రైతులు పంట సరుకులు తీసుకురావడం.. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది.

అయితే, రైతు ల ద్వారా రాబడి పెద్దమొత్తంలో ఉన్నా వారి సంక్షేమం కోసం నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టే విషయంలో అటు పాలకవర్గాలు, ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రైతులు సౌకర్యాల లేమితో ఇబ్బం ది పడుతుండగా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల నిర్వహణ లోపభూయిష్టంగా మారుతోంది.

 జిల్లాలో 14 మార్కెట్లు
 జిల్లా పరిధిలో ప్రస్తుతం 14 మార్కెట్లు ఉండగా, వీటిన్నింటిపై గత ఆరేళ్లలో రూ.177 కోట్ల ఆదాయం వ చ్చింది. ఇందులో ఒక వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ ద్వారా గత ఏడాది రూ.20కోట్ల ఆదాయం లభించింది. ఇది ఏటేటా పెరుగుతున్నా మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పన ఆ స్థాయిలో ఉండడం లేదు.

 ఇక మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చే రైతుల సంక్షేమాన్ని అటు పాలకవర్గాలు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో వారు అరిగోస పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు రైతుబం ధు పథకం, రైతు బీమా, రైతు ఆరోగ్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవా ల్సి ఉంటుంది. కానీ, ఆ దిశగా ఏ పాలకవర్గం కూడా దృష్టి సారించడం లేదు.

 వరంగల్ మార్కెట్ ఆదాయమే రూ.94 కోట్లు
 వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు ఏటా ఆదాయం పెరుగుతున్నా మౌలిక సదుపాయాలకు సర్కారు ఖ ర్చు చేస్తున్నది అంతంత మాత్రమే. ఈ మార్కెట్‌కు 2008-2009 సంవత్సరానికి 13.16 కోట్ల ఆదాయం రాగా, 2009-2010 లో రూ.14-15 కోట్లు, 2010-11లో రూ.17.36 కోట్లు, 2011-12లో రూ.18.05 కోట్లు వచ్చింది.

ఇక 2012-13 సంవత్సరంలోనైతే మార్కెట్ ఆదాయం రూ.20కోట్లకు చేరుకోగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు సుమారు రూ.12 కోట్లకు చేరుకుంది. అంటే మొత్తం ఆరేళ్లలో సుమారు రూ.94 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఆరోగ్య కేంద్రాల ద్వారా నెలకు రూ.10వేల మందులు మా త్రమే రైతులకు అందజేస్తున్నారు. అలాగే, గత ఆరేళ్ల లో నర్సంపేట మార్కెట్‌కు రూ.16.44 కోట్ల ఆదా యం రాగా, కేసముద్రం మార్కెట్ రూ.

10.52 కో ట్లు, జనగామకు రూ.11.88 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.7.96 కోట్లు, ములుగుకు రూ 6.89 కోట్లు చే ర్యాలకు రూ.5.25 కోట్లు, పరకాలకు రూ.4.96 కో ట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌కు రూ.4.25 కోట్లు, వర్ధన్నపేటకు రూ.2.97 కోట్లు, నెక్కొండకు రూ.3.91 కోట్లు, ఆత్మకూరుకు రూ.2.13 కోట్లు, తొర్రూరుకు 4.55 కోట్లు, కొడకండ్ల మార్కెట్‌కు రూ.2.04 కోట్ల ఆదాయం లభించింది. అన్ని కలిపి 2008 నుంచి 2014 వరకు రూ.177 కోట్ల ఆదాయం వస్తే, రైతు సంక్షేమానికి రూ.2కోట్లే ఖర్చు చేశారంటే పాలకవర్గాలు, అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.

 రైతు సంక్షేమం కోసం ఇలా ఖర్చు చేయచ్చు
 మార్కెట్ యార్డులకు పంట సరుకులు తీసుకొచ్చే రై తుల ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వారి సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు. రైతు బంధు, రైతు బీమా, రైతుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటుచే స్తూ వారికి విశేష సేవలు అందించవచ్చు. కానీ జిల్లా లో ఉన్న 14 మార్కెట్లలోని ఏ పాలకవర్గం కూడా ఈ దిశగా దృష్టి సారించడం లేదు.

కొన్ని మార్కెట్‌లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం సైతం అందుబాటులో లేదంటే మార్కెట్‌కు వచ్చే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అ ర్థం చేసుకోవచ్చు.
 ఇక ప్రతి మార్కెట్‌కు వచ్చే ఆదాయంలో 20 శా తం నిధులు యార్డుల అభివృద్ధికి, మార్కెట్‌లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయొచ్చ నే నిబంధన ఉండగా... ఈ నిధులు మాత్రం ఏటా తప్పకుండా ఖర్చు చేస్తున్నారు. ఏమంటే ఈ నిధుల ద్వారా చేపట్టే పనుల ద్వారా కమీషన్లు లభిస్తాయనే ఆశ. ఇప్పటికైనా పాలకవర్గాలు, అధికారులు రైతు సంక్షేమంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు