-

వన్ డే చైర్మన్

26 May, 2016 00:51 IST|Sakshi

శ్రీకాళాహస్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య ముదిరిన
ఆధిపత్య పోరు రెండు వర్గాలుగా చీలిన
టీడీపీ కౌన్సిలర్లు  కావాలనే అత్యవసర సమావేశానికి గైర్హాజరు
అందిపుచ్చుకున్న ప్రతిపక్ష సభ్యులు
ఒకరోజు చైర్మన్‌గా ప్రతిపక్ష కౌన్సిలర్ జిల్లాలోనే సంచలనం

 

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వుున్సిపాలిటీలో సంచలనం చోటు చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా బుధవారం జరగాల్సిన అత్యవసర సమావేశానికి ఆ పార్టీ కౌన్సిలర్లందరూ డుమ్మా కొట్టారు. కోరం లేక సమావేశం వాయిదా పడుతుందని లైట్ తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష కౌన్సిలర్లతోపాటు మరో కౌన్సిలర్ తోడవడంతో డెలిగేట్ మున్సిపల్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్ వ్యవహరించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.

 
ఆది నుంచీ వివాదమే..

శ్రీకాళహస్తి వుున్సిపల్ పాలకవర్గం ఆది నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. పాలకవర్గం ఏర్పడిన కొన్నిరోజులకే వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, వైస్ చైర్మన్ వుుత్యాల పార్థసారథి వుధ్య రాజకీయు వైరుధ్యం ఆధిపత్య పోరుకు  దారితీసింది. అది మరికొన్నాళ్లకు ముదిరిపాకాన పడి కువుు్మలాటలకు దారితీసిం ది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన స్థానిక మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఏ పథకమొచ్చినా తవు అనుచర కౌన్సిలర్ల వార్డుల్లో ప్రారంభించాలంటూ ఆ వర్గాలు రెండూ వాదనలకు దిగడం రివాజుగా మారుతోంది. ఇటీవల ఈ రెండు వర్గాలు రోడ్డెక్కాయి. చైర్మన్‌ను వూర్చాలని ఓ వర్గం, కొనసాగించాలని మరో వర్గం ర్యాలీలు, ధర్నాలు చేసిన విషయం తెల్సిందే. అంతటితో ఆగక ఒకరిపై వురొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కరపత్రాలు పంచడం తీవ్ర దువూరం లేపింది.

 
మంత్రి కర్రపెత్తనం

వుున్సిపల్ పాలకవర్గం అసవుర్థత బహిర్గతం కావడంతో వుంత్రి బొజ్జల కుటుంబీకులు వుున్సిపల్ అధికారులపై అజవూరుుషీ చే స్తూ కర్రపెత్తనానికి దిగారు. వుున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల వుధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంతో వారి ఆగడాలకు కత్తెర వేసే దిశగా వుంత్రి మానిటరింగ్ కమిటీని నియమించారు. ఇందులో ఏర్పేడు మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, శ్రీకాళహస్తి మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉన్నారు. ఇకపై మున్సిపాలిటీలో పూచికపుల్ల కదలాలన్నా వీరి అనుమతి తప్పనిసరి కానుంది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో వీరంతా సవూవేశమై చర్చ లు సాగించినట్లు తెలిసింది. అరుుతే టీడీపీ కౌన్సిలర్లు తావుు వుహానాడు పనులను పర్యవేక్షించేందుకు వెళ్లినట్లు బొంక డం గమనార్హం.

 
ఒకరోజు చైర్మన్‌గా

శ్రీకాళహస్తి వుున్సిపాలిటీలో మొత్తం 35 వుంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 21వుంది టీడీపీ, 11వుంది వైఎస్సార్ సీపీ, వుుగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. కాగా బుధవారం జరిగిన అత్యవసర సవూవేశానికి చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు టీడీపీకి చెందిన 21వుంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యూరు. ప్యానెల్ కమిటీ సభ్యులు (నలుగురు) కూడా సవూవేశానికి రాలేదు. కాగా వైఎస్సార్ సీపీకి చెందిన 11వుందితోపాటు ఓ బీజేపీ కౌన్సిలర్ తోడవడంతో కోరానికి సరిపడా బలం చేకూరింది. దీంతో సవూవేశం జరపాలని వుున్సిపల్ కమిషనర్ శ్రీరావుశర్మను వైఎస్సార్ సీపీ కోరింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ ఫ్లోర్ లీడర్ గువ్ముడి బాలకృష్ణయ్యు నేతృత్వంలో డెలిగేట్ వుున్సిపల్ చైర్మన్‌గా 22వ వార్డు వుున్సిపల్ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్యును ఏకగ్రీవంగా ఎన్నుకుని సవూవేశాన్ని నిర్వహించారు. పలు అంశాలను తీర్మానించడం చర్చనీయాంశమైంది.

 

మరిన్ని వార్తలు