ఆటో ఢీకొని వ్యక్తి మృతి

8 Nov, 2015 08:24 IST|Sakshi

జగ్గంపేట (తూర్పుగోదావరి) : వేగంగా వెళ్తున్న ఆటో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని దేవి సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పైడా నాగేశ్వరరావు(45)ను లింగంపర్తి నుంచి పెద్దాపురం వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు