బోరు లారీ బోల్తా: ఒకరు మృతి

12 May, 2015 08:16 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట వద్ద మంగళవారం బోరు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మరిన్ని వార్తలు