కూలి పనికి వెళ్లి అనంత లోకాలకు..

26 Jun, 2015 03:08 IST|Sakshi

పెదకాపవరం (ఆకివీడు) : ఐస్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయూలయ్యూరుు. లారీ క్యాబిన్‌లో ప్రయూణిస్తున్న చేపల ప్యాకింగ్ కార్మికుడు గోడి రమణ (40) అక్కడికక్కడే మృతిచెందగా బోనుల జార్జి (50), పితాని శ్రీను (35) అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. లారీ తిరగబడటంతో క్యాబిన్‌లో చిక్కుకుపోరుున రమణ కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. రమణ ను కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యూరుు.
 
 ఆకివీడు మండలం పెదకాపవరంలో వెంకయ్య వయ్యేరు కాలువ వంతెన  వద్ద జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..  గణపవరం నుంచి లారీలో ప్యాకింగ్ కూలీలను ఎక్కించుకు ని ఐస్ లోడు, చేపల ట్రేలతో డ్రైవర్ పెదకాపవరంలో ఓ చెరువు వద్దకు వెళ్లాడు. కొన్ని కారణాల వల్ల చేపల పట్టుబడి నిలిచిపోవడంతో వీరంతా అదే లారీలో తిరుగు ప్రయూణమయ్యూరు. పెదకాపవరంలో వెంకయ్య వయ్యేరు వంతెనపైకి వచ్చేసరికి లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి నిలిపివేశాడు. ఐదు నిమిషాల తర్వాత వంతెనపై నుంచి లారీ పక్కకు ఒరగడం మొదలైంది. దీనిని గమనించిన లారీపై ఉన్న కూలీలు, డ్రైవర్ కిందకు దూకేశారు. కొద్ది సేపటికి వంతెన పక్కనున్న రోడ్డుపైన లారీ తిరగబడింది. దీంతో లారీ క్యాబిన్‌లో చిక్కుకుపోరుున కార్మికుడు రమణ శరీరం నుజ్జునుజ్జుకాగా జార్జి కుడి కాలు, శ్రీను ఎడమ కాలుకు తీవ్రగాయూలయ్యూరుు.
 
 ఆక్రందనలు చేస్తూ కన్నుమూత
 లారీ బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు స్పందించి చేపల ట్రేలను, ఐస్‌ను కిందకు దించారు. క్యాబిన్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. తీవ్రగాయూలైన రమణ రక్షించండంటూ ఆక్రందనలు చేస్తూ కన్నుమూశాడు. జార్జి, శ్రీనును బయటకు తీసిన స్థానికులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉండి మండలం వెలివర్రు గ్రామానికి చెందిన రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తహసిల్దార్ వి.నాగార్జునరెడ్డి, ఎస్సై కె.అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఏ ఎంసీ చైర్మన్లు మోటుపల్లి రామవరప్రసా ద్, కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, గ్రామ పెద్ద తోట ఏడుకొండలు, సర్పంచ్ లం బాడి మురళీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ మందలంక జాన్ వెస్లీ తదితరులు పరి శీలించి బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 మాకు దిక్కెవరు నాన్నా
 ‘నాన్నా.. వెళ్లిపోయూవా.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ మృతుని కుమార్తె శాంతి, భార్య మాణిక్యం రోదనలు మి న్నంటారుు. కొద్దిసేపు కన్నీరుమున్నీరైన శాంతి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను చికిత్స కోసం అంబులెన్సులో తరలించారు. ఘటనా స్థలం వద్ద రమణ బంధువులు, కుటుంబ సభ్యులు రోదిం చిన తీరు కన్నీళ్లు తెప్పించింది. వెలివై లో విషాదఛాయలు అలముకున్నాయి.
 

>
మరిన్ని వార్తలు