రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

24 Oct, 2015 10:35 IST|Sakshi

అతివేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..  తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రాజుపేటకు చెందిన నాగేశ్వరరావు తన సైకిల్‌పై ఉదయం 16వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్నారు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన కారు ఆయన్ను ఢీకొంది. అనంతరం మరో సైకిల్‌ను, బైక్‌ను ఢీకొట్టింది. ఆపై ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొని ఆగిపోయింది.
ఈ ఘటనల్లో మొదటి సైకిలిస్టు నాగేశ్వరరావు అక్కడికక్కడే చనిపోగా, మరో సైకిలిస్టు, మోటార్‌సైకిలిస్టు తీవ్ర గాయాల పాలయ్యారు. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారు ఎవరూ గాయపడలేదు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం క లిగింది. ఎస్సై అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు