ఉదయం సన్మానం.. సాయంత్రం మృతి

9 Jul, 2014 01:34 IST|Sakshi
ఉదయం సన్మానం.. సాయంత్రం మృతి

భీమడోలు : భీమడోలులో మంగళవారం ఉదయం సన్మానం పొందిన ఓ ఉద్యోగి అనంతరం ఇంటికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. భీమడోలు పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సింగలూరి నాగేంద్రప్రసాద్(54) 18 ఏళ్లపాటు మండలంలోని పలు పంచాయతీల్లో పనిచేశారు. ఆయనకు ఇటీవల నిడదవోలు మండలం శెట్టిపేట పంచాయతీ గ్రేడ్-2 కార్యనిర్వాహణాధికారిగా పదోన్నతి లభించింది. అక్కడ విధుల్లో చేరిన ఆయనకు భీమడోలు పంచాయతీ కార్యాలయ సిబ్బంది మంగళవారం సన్మానం చేయూలని నిర్ణరుుంచడంతో కార్యక్రమానికి హాజరైన నాగేంద్రప్రసాద్ అనంతరం ఇంటికి వెళ్లి గుండెపోటుతో కుప్పకూలిపోయూరు.

ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. సోమవారం వడదెబ్బకు గురైన ఆయన నీరసంగా ఉన్నప్పటికీ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. మృతదేహాన్ని సందర్శించిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని నాగేంద్రప్రసాద్ స్వగ్రామం కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం తరలించారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, సర్పంచ్ పి.శిరీషా, ఉప సర్పంచ్ యలమర్తి నాని, నాయకులు రామకుర్తి నాగేశ్వరరావు, పైడిమాల యుగంధర్, యలమర్తి శంభాజీ రావు సంతాపం తెలిపారు.
 

మరిన్ని వార్తలు