ఈఎస్ఐ స్కాం : మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్‌

10 Jul, 2020 14:32 IST|Sakshi

సాక్షి, విజ‌యవాడ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ త‌మ‌ విచారణను మ‌రింత వేగవంతం చేసింది. ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెనాయుడు స‌హా ప‌ది మంది ఈ కేసులో అరెస్టైన విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం  ఏసీబీ అధికారులు మ‌రొక‌రిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ వ‌ద్ద‌ పీఎస్‌గా ప‌నిచేసిన ముర‌ళీ మోహ‌న్ అనే వ్య‌క్తిని స‌చివాల‌యంలో అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అచ్చెనాయుడు త‌ర్వాత  పితాని స‌త్య‌నారాయ‌ణ కార్మిక శాఖ మంత్రిగా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం అధికారుల అదుపులో ఉన్న ముర‌ళీ మోహ‌న్ ప్ర‌స్తుతం స‌చివాలయంలోని మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలలో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు గ‌త శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
(అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు)

>
మరిన్ని వార్తలు