తిరుమలలో చంటిబిడ్డ అపహరణ

15 Jun, 2017 01:13 IST|Sakshi
తిరుమలలో చంటిబిడ్డ అపహరణ
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఏడు నెలల వయసున్న చంటిబిడ్డ అపహరణకు గురికావడం కలకలం రేపింది. తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్న చిన్నారి బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు కలసి ఎత్తుకెళ్లారు. నిద్రలేచిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా.. చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ మండలం ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మలు తమ పిల్లలు ప్రమీల(8),  శ్రీనివాసులు(6), సువర్ణ(2), చిన్నకుమారుడు చెన్నకేశవులు(7నెలలు)తో కలసి శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం తిరుమల వచ్చారు.  దర్శనం పూర్తిచేసుకున్న వారు  రాత్రికి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ప్రాంతంలో నిద్రించారు. బుధవారం వేకువన నాలుగు .. 5.30 గంటల సమయాల్లో బాలుడికి తల్లి రత్నమ్మ పాలుపట్టి.. నిద్రలోకి జారుకుంది.  ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు