కొనసాగుతోన్న అల్పపీడనం

28 May, 2014 00:21 IST|Sakshi

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా భూతలం వైపు వచ్చి జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇది ఉత్తర దిశగా నేపాల్ వైపు పయనిస్తూ క్రమేపీ బలహీనపడే అవకాశాలున్నట్టు తెలిపింది.

దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా లేదని, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. బెంగళూరు, మద్రాస్‌పై మేఘాలు బాగా ఆవరించి ఉండటంతో నెల్లూరు జిల్లా, రాయలసీమలో కొద్దిగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు నిఫుణులు తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు