‘ఒంగోలు పెయ్య @ రూ.3.50 లక్షలు

12 Mar, 2016 03:04 IST|Sakshi
‘ఒంగోలు పెయ్య @ రూ.3.50 లక్షలు

ఒంగోలు జాతి పశు సంపదపై రైతులకు మక్కువ పెరుగుతోంది. సరిగ్గా 10 నెలలు నిండిన ఓ పెయ్య దూడ ను కృష్ణా జిల్లా నున్న మండలానికి చెందిన రైతు బొంతు సాయి రామిరెడ్డి రూ. 3.50 లక్షలకు కొనుగోలు చేశాడు. వైఎస్‌ఆర్ జిల్లా, మైదూకూరు మండలం, నెల్లూరు కొట్టాల గ్రామానికి చెందిన చిలమకూరు కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంగోలు జాతి పశు సంపదను అభివృద్ధి చేయాలనే తలంపుతో తెనాలిలో ఓ రైతు వద్ద (మూల పుట్టుకను కనుగొని) ఆ జాతి ఆవును కొనుగోలు చేసి తీసుకొచ్చాడు.

గుంటూరు లాంఫాంలో అదే జాతి ఆబోతు వీర్యాన్ని తీసుకొచ్చి ఈ ఆవుకు సంక్రమింపజేసి సంతతిని పెంపొందించాడు. ఆ విధంగా ఇప్పటికి ఎద్దులు, పెయ్య, లేగ దూడలు కలిపి ఎనిమిది, ఆరు ఆవులు ఉన్నాయి. ఇందులో మూడో తరంగా చెప్పుకుంటున్న ఈ పెయ్య దూడను కృష్ణా జిల్లా రైతు సాయి రామిరెడ్డి ఇష్టపడి పదే పదే కావాలని కోరడంతో రూ. 3.50 లక్షలకు విక్రయించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతతిని అభివృద్ధి చేయాలనేదే తన ధ్యేయమన్నారు. ఇందుకు సహకరిస్తానని చెప్పడంతోనే ఆయనకు పెయ్య దూడను విక్రయించానని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
     - కడప అగ్రికల్చర్

మరిన్ని వార్తలు