ఉల్లి.. దిగివస్తోంది మళ్లీ

17 Dec, 2013 04:37 IST|Sakshi

సామాన్యుల కంట కొంత కాలం కన్నీరు పెట్టించిన ఉల్లి ధర దిగివస్తోంది. తెల్ల ఉల్లి ధర కిలోకు రూ. 25కు తగ్గింది. ఎర్ర ఉల్లి ధర రూ. 20 పలుకుతోంది. మహారాష్ట్ర ప్రాంతంనుంచి భారీగా ఉల్లి పంట దిగుమతి అవుతుండడంతో ధర తగ్గుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వేసవిలో ఉల్లి ధర భారీగా పెరిగింది. కిలో ఉల్లి ధర రూ. 80కి పైగా పలికింది. తర్వాత కొంత దిగివచ్చినా రూ. 50 కి తగ్గలేదు. వారం రోజులుగా మహారాష్ట్రలోని అకోలా, ఉమ్రీ, నాందేడ్ తదితర ప్రాంతాలనుంచి ఎర్ర ఉల్లిగడ్డలు, ఆంధ్ర ప్రాంతం నుంచి తెల్ల ఉల్లిగడ్డలు భారీగా దిగుమతి అవుతున్నాయి. దీంతో రెండు రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం తెల్ల ఉల్లిగడ్డలు కిలోకు రూ. 25, ఎర్ర ఉల్లిగడ్డలు రూ. 20కి లభిస్తున్నాయి. ఉల్లి సీజన్ ప్రారంభమైందని, ఇక ధర తగ్గుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు