పోస్టాఫీసులో ఆన్‌లైన్ అకౌంట్‌లు

10 May, 2014 01:27 IST|Sakshi

- పాస్ పుస్తకాలు అప్‌డేట్ చేసుకోండి
- పోస్టల్ సూపరింటెండెంట్ మురళీమోహన్

 
 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: పోస్టాఫీసులో ఆన్‌లైన్ ద్వారా అకౌంట్లు నిర్వహించనున్నామని పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.మురళీమోహన్ తెలిపారు. బ్యాంకుల్లో లావాదేవీలు మాదిరిగా సేవింగ్స్ బ్యాంకు (ఎస్‌బీ) సేవలు విస్తృతం చేస్తామన్నారు. ప్రతి ఖాతాదారుడు ఎస్‌బీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయాలని సూచిం చారు. విజయనగరం హెడ్ పోస్టాఫీసును పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌లోకి తీసుకున్నారన్నారు. త్వరలో ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొదటి దశలో ప్రధాన కార్యాలయంలో సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను, వాటి సమాచారాన్ని కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకుని అకౌంట్లను ఆన్‌లైన్ చేయనున్నామన్నారు.

 ఈ ఖాతాలను బదిలీ చేసేందుకు ఈ నెల 16న చర్యలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం హెడ్ పోస్టాఫీసులోని ఖాతాదారులంతా వారి పాస్ పుస్తకాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఎస్‌బీ, ఆర్‌డీ, టీడీ, ఎంఐఎస్, పీపీఎఫ్ ఖాతాలు అప్‌డేట్ చేసుకుంటే ఆన్‌లైన్ వ్యవస్థను త్వరితగతిన ప్రారంభించడానికి వీలువుతుందని మురళీమోహన్ తెలిపారు.
 తొలుత ప్రధాన కార్యాలయాలను ఆన్‌లైన్‌లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించి ఆ తర్వాత గ్రామాల్లో  ఉన్న సబ్ పోస్టాఫీసులు, బ్రాంచి పోస్టాఫీసులకు కూడా దశలవారీగా కోర్ బ్యాంకింగ్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరిన్ని వార్తలు