రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

4 Jul, 2017 01:38 IST|Sakshi
రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు 
 
విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో  కన్వీనర్‌ కోటా (కాంపిటెంట్‌ అథారిటీ) సీట్లలో అడ్మిషన్ల కోసం నీట్‌ మెడికల్‌ృ2017లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనిర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అనుబంధ (ప్రభుత్వ, నాన్‌మైనార్టీ, మైనార్టీ) మెడికల్‌/డెంటల్‌ కళాశాలలతో పాటు తిరుపతి స్విమ్స్‌  కళాశాలలోని (మెడికల్‌) సీట్లకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది.

దరఖాస్తులు 5వ తేదీ ఉదయం 11 గంటలకు నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు హెచ్‌టీటీపీ://ఎంఈడీఏడీఎం.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏసీ.ఇన్,   హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. నీట్‌ పరీక్షలో కటాఫ్‌ స్కోర్లను... ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం పర్సంటైల్‌ (131మార్కులు), ఎస్‌సీ/ఎస్‌టీ/బీసీ అభ్యర్థులు 40 శాతం పర్సంటైల్‌ (107మార్కులు), దివ్యాంగుల ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం పర్సంటైల్‌ (118 మార్కుల) నిర్ణయించారు. అకడమిక్‌ క్వాలిఫైయింగ్‌ (అర్హత) పరీక్ష (ఇంటర్మీడియెట్‌)లో కూడా ఓసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, ఎస్‌సీ/ఎస్‌టీ/బీసీ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం,  ఓపెన్‌ కేటగిరీ దివ్యాంగులు అభ్యర్థులు 45 శాతం మార్కులు మార్కులు పొంది ఉండాలి. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా