సెల్‌కు బదులు ఏటీఎం పౌచ్‌!

2 Aug, 2018 11:22 IST|Sakshi
బాధితుడు, పార్శిల్‌లో ఉన్న వస్తువులు

మార్కాపురం టౌన్‌ (ప్రకాశం): మోసపోయే వాళ్లుంటే మోసగించే వాళ్లకు కొదవ లేదనట్లు ఆన్‌లైన్‌లో సెల్‌ బుక్‌ చేస్తే ఏటీఎం పౌచ్‌లు వచ్చాయి. వివరాలు.. మార్కాపురానికి చెందిన డి.శ్రీధర్‌రెడ్డి మోటార్‌ వర్క్స్‌ షాపులో మోటార్లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పది రోజుల కిందట ఆయనకు ఫోన్‌ వచ్చింది. మీ నంబర్‌కు రూ.12 వేల విలువై వివో స్మార్ట్‌ఫోన్‌ లక్కీ డీప్‌లో తగిలిందని చెప్పారు. కేవలం రూ.4,150లకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం నగదు లేకపోతే క్యాష్‌ ఆన్‌ డెలివరీ విధానంతో పోస్టల్‌ ద్వారా పార్శిల్‌ వస్తుందని, నగదు చెల్లించి తీసుకోవచ్చని సెలవిచ్చారు. శ్రీధర్‌రెడ్డి నగదు చెల్లించి పార్శిల్‌ అందుకున్నాడు.

తీరా విప్పి చూస్తే ఏటీఎం కార్డులు పెట్టుకునే రెండు పౌచ్‌లు, బెల్ట్‌ ఉన్నాయి. మోసపోయానని గ్రహించి తిరిగి తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేయగా వచ్చిన పార్శిల్‌ను తిరిగి పంపితే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు పంపుతామని చెప్పకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్‌ తెలపాలని కోరారు. నగదు రాకపోగా అకౌంట్‌లో ఉన్న నగదు కూడా పోతాయేమోనని భావించి వారికి నంబర్‌ చెప్పలేదు.

మరిన్ని వార్తలు