ధాన్యం కొనుగోలుకు ఆన్లైన్ విధానం

12 Feb, 2015 15:54 IST|Sakshi

ఏలూరు: రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల శాఖ ఎండీ కె. రామ గోపాల్ తెలిపారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ...ఖరీఫ్‌లో పౌరసరఫరాల కేంద్రాల నుంచి  రూ. 2 వేల కోట్ల విలువైన 25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. 

నూతన నిబంధనలను అనుసరించి 75 శాతం వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే వీలు కలిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు బి. కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు