ఏపీ టెట్‌ పరీక్ష నిర్వహణలో గందరగోళం

15 Feb, 2018 13:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ టెట్‌ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఏ జిల్లా నుంచి అభ్యర్ధి దరఖాస్తు చేస్తే ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అదే విధంగా సీటింగ్‌ కేపాసిటీ లేకుండానే పలు కేంద్రాలకు అధికారులు హాల్‌ టికెట్లను జారీ చేశారు. మరో వైపు హాల్‌ టిక్కెట్ల డౌన్‌ లోడ్‌లో  కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి మూడో తేదీత వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే టెట్‌ నిర్వహణకు సంబంధించిన లోటుపాట్లతో మళ్లీ పరీక్షల వాయిదా పడుతుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

అధికారులపై గంటా ఆగ్రహం
టెట్‌ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల కేటాయింపుల్లో పొరపాట్లు చోటు చేసుకోవడం పై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంటా సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్ధులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నిలదీశారు. తొలిసారి ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని  ముందు నుంచి చెబుతున్నా అధికారుల అలసత్వం కనబరచడం సరికాదన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి గురువారం విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  

మరిన్ని వార్తలు