ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి

7 Jan, 2014 01:57 IST|Sakshi
  • వారి వల్లే నటులకు అవకాశాలు రావడంలేదని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
  •  సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే శాసిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లను ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు సోవువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
     
    సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుం డా పోతున్నాయని తెలిపారు. సినిమా అవకాశాలు లేకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఆ 4 కుటుంబాల ఆధిపత్యం కారణంగా తమకు అన్యా యం జరిగిందంటూ ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామంటూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు పేరిరెడ్డి నిరాకరించారు.
>
మరిన్ని వార్తలు