40 లక్షల జనాభాకు ఒకే సీటీస్కాన్

11 Sep, 2013 01:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తమ దేశంలో నలైభె  లక్షల జనాభా ఉంటే కేవలం ఒకే సీటీ స్కాన్ యంత్రం అందుబాటులో ఉందని లైబీరియా దేశ అధ్యక్షురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో మంగళవారం లైబీరియా నేత్ర ఆరోగ్య కార్యక్రమం ప్రారంభమైంది. ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ గుల్లపల్లి ఎన్.రావుతో కలిసి ఎలెన్ జాన్సన్ ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి వైద్యానికి సంబంధించి తమ దేశంలో ఒక్క వైద్యుడు కూడా లేరని చెప్పారు. ఒక నివేదిక ప్రకారం లైబీరియాలో 0.5 శాతం మంది అంధులు ఉన్నారని తెలిపారు. ఇప్పుడిప్పుడే తమ దేశంలో వైద్య ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. కనీసం ఐదు కిలోమీటర్లు వెళితేగానీ వైద్య సహాయం అందని స్థితిలో తమ దేశ పౌరులు ఉన్నారని పేర్కొన్నారు.  ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి తమ దేశ ప్రజలకు నేత్ర వైద్యం అందించనుండడంపై ఆమె అభినందలు తెలిపారు.

మరిన్ని వార్తలు