ఉత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు

15 Apr, 2016 02:19 IST|Sakshi
ఉత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు

♦ నేటి నుంచి కోదండరామునికి బ్రహ్మోత్సవాలు
♦ ధ్వజారోహణం, పోతన జయంతి, కవి సమ్మేళనం
♦ 20న సీతారాముల కల్యాణోత్సవం
 
 ఒంటిమిట్ట: వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణ గావించారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం చేయనున్నారు. స్వామివారికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 20న సీతారాముల కల్యాణోత్సవ నిర్వహణకు 70 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల మేర చలువ పందిళ్లు వేయనున్నారు. ఏటా శ్రీరామనవమి రోజునే పోతనామాత్యుని జయంతిని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులతో శుక్రవారం సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహిస్తారు. రాత్రికి స్వామి వారు శేషవాహనంపై ఊరేగుతారు.

 రాముడు ఆదర్శం కావాలి: సీఎం చంద్రబాబు
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రజలకుముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా రెండోసారి నవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సీఎం తెలి పారు. ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడే ఆదర్శం కావాలన్నారు.

మరిన్ని వార్తలు