అవయవదానంతో శాశ్వత జీవితం

4 Jan, 2014 02:50 IST|Sakshi

 హొంజరాం(సంతకవిటి),న్యూస్‌లైన్: అవయవ దానంతో  శాశ్వత జీవితాన్ని పొందవచ్చునని సెంట్రల్ జ్యూట్ కార్పొరేషన్ డెరైక్టర్  సిరిపురపు కుమారస్వామి అన్నారు. మండలంలోని హొంజరాం గ్రామంలో శ్రీవంజపోలమ్మ యూత్ కమిటీ సభ్యులు శుక్రవారం ఏర్పాటుచేసిన అవయవదాన అవగాహన సదస్సులో  ఆయన మాట్లాడారు. అవయ వదానం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ముందుగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేస్తే చనిపోయిన తరువాత మన అవయవాలను ప్రభు త్వం తరఫున వైద్యాధికారులు తీసుకుంటారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా ఆధ్యాత్మిక ధార్మిక సలహామండలి కార్యదర్శి సిరిపురపు కన్నంనాయుడు మట్లాడుతూ అవయవదానంపై అపోహాలు వీడాలని సూచించారు.
 
  అనంతరం సంతకవిటి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.రాకేష్, హొంజరాం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం అసిరినాయుడు, బూరాడపేట పాఠశాల హెచ్‌ఎం కె.రమణ, యువ కులు గ్రామస్తులుకు పలుసూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో 300 మంది గ్రామస్తులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బొద్దాన సూర్యారావు, మామిడి వంజయ్య, జి.గణేష్, చిన్నారావు, శేఖర్, నాగభూషణరావు, సింహాచలం, సీహెచ్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 గ్రామంలో సంఘటన ఆధారంగా...
  మా గ్రామంలో రాము మాష్టారు కిడ్నీ వ్యాధితో మంచంపట్టారు.  కిడ్నీ కోసం చాలా దగ్గర్ల ప్రయత్నిం చినా ఫలితం కనిపించలేదు. చివ రకు ఆయన కుమార్తె కొర్ను శ్రీలక్ష్మి కిడ్నీ ఇవ్వడంతో ప్రాణాలతో నిలిచారు. భవి ష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేం దుకే గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.
                   -బి.సూర్యారావు,
 
 ఎస్‌వీపీ యూత్ అధ్యక్షులు, హొంజరాం
 యువకుల నిర్ణయం అభినందనీయం...
 గ్రామంలో యువకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభినం దనీయం. ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలా మంది గ్రామస్తులు అవయవాలను దానం చేసేందుకు ముందుకురావడం మంచి పరిణామం.  
         -ఎస్. కుమారస్వామి, సెంట్రల్ జ్యూట్ కార్పొరేషన్ డెరైక్టర్, హొంజరాం
 

మరిన్ని వార్తలు