వెలుగు ఉద్యోగుల్లో చీకట్లు!

2 Oct, 2014 02:24 IST|Sakshi
వెలుగు ఉద్యోగుల్లో చీకట్లు!

విజయనగరం అర్బన్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయంగా మారింది. ఈ సంస్థను మూ సి వేయాలని ఇటీవల ప్రభుత్వానికి ఆర్థికశాఖ సిఫారసు చేయడం ఆ సంస్థలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. సెర్ప్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధా న హామీగా ప్రకటించిన టీడీపీ, అధికారం చేతికొచ్చాక ఇలా వ్యవహరించడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వెలుగు’(ప్రస్తుత సెర్ప్) పేరుతో రాష్ట్రంలో మహిళాభివృద్ధికి పునాదు లు వేసిన ఘనత తమదేనని, పార్టీ అధికారంలోకి వస్తే ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారం వచ్చా క ఇప్పుడు సెర్ప్‌ను మూసివేసేదిశగా అడుగు లు వేయడంపై ఈ సంస్థ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. 14 ఏళ్లుగా ఇదే సంస్థ ను నమ్ముకొని పనిచేస్తున్న తమను ఇలా నట్టేట ముంచడం దారుణమని వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో క్లర్క్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయి వరకు జిల్లా వ్యాప్తం గా 270 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది ఉద్యోగులున్నారు. వీరేకాకుండా పంచాయతీకి ఒక్కరు చొప్పున జిల్లాలో మరో వేయిమంది వరకు విలేజ్ బుక్ కీపర్లు పనిచేస్తున్నారు. సంస్థ మూసివేస్తే వీరంతా వీధిన పడాల్సిందే.
 
 ఎందుకీ వివక్ష?
 మహిళా అభ్యున్నతి కోసం గ్రామస్థాయిలో
 ‘వెలుగు’ పేరుతో తొలుత 2000 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటుచేసింది. 14 ఏళ్లుగా ఈ సంస్థ ఉద్యోగులు అందించిన సేవలకు దేశవ్యాప్తంగా మంచిగుర్తింపు లభించింది. మహిళా స్వయం సహా యక సాధికారిత తీసుకురావడంలో ఉత్తమ ఫలితాలను సాధించడం వల్లే ఈ సంస్థను ఇతర రాష్ట్రాలకు రీసోర్స్ సెంటర్‌గా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతా ల మహిళాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఆధ్వర్యంలో ఇతరరాష్ట్రాలకు అవగాహన కలిగించే రిసోర్స్‌సెంటర్‌గా మన రాష్ట్ర సెర్ప్‌సంస్థ తాజాగా వ్యహరిస్తోంది. జిల్లా నుంచి ఈ సంస్థ 40మంది మహి ళా గ్రూప్ సభ్యులను  రిసోర్స్‌పర్సన్లగా ఎంపిక చేసి రాజస్థాన్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు పంపింది. కేవలం 10వ తరగతి విద్యార్హత మాత్ర మే ఉన్న వీరు ప్రస్తుతం రోజుకు రూ.1,500 వరకు వేతనం పొందున్నారు.  
 
 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
 సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ నేతలు ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీని అమలు చేయాలని సెర్ప్ ఉద్యోగుల సంఘం జిల్లా కమి టీ అధ్యక్షుడు వై.హరేరాం కోరారు. సంస్థలో ఉద్యోగులను అవుట్ సోర్స్ విధానంలో భర్తీ చేసినప్పటికీ  పక్కాగా అర్హత పరీక్షలు, రోస్టర్ విధానంతో ఎంపికయినట్టు చెప్పారు. శాశ్వతఉద్యోగానికి కూడా ఇలా పరీక్షలు నిర్వహంచరేమో అన్నట్లు నియామకాలు చేశారని పేర్కొన్నారు. అంతేస్థాయిలో సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చామని చెప్పారు. జీతాలు మాత్రం అరకొరగానే అందుకుంటున్నామని, తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటనతో ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడిం దని తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రుల సబ్‌కమిటీకి పలుమార్లు వినతి పత్రాన్ని అందజేశామని హరేరాం తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు