సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడించిన ఓయూ జేఏసీ

1 Jan, 2014 18:54 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు స్థానచలనం కల్పించిన నేపథ్యంలో ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ను బుధవారం ఓయూ జేఏసీ ముట్టడించింది. సీఎంకు నిరసనగా ఓయూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓయూ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు.

కాగా, శ్రీధర్బాబును తొలగించడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర మంత్రులు సీఎం కిరణ్ కుమార్రెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రులపై మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఇప్పటికే కొందరు సీఎం పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.  శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాలను తప్పించి, వాణిజ్య పన్నులు కేటాయించడం వారిలో మరింత ఆగ్రహన్ని పెంచింది. వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. అయితే వాణిజ్య శాఖను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని శ్రీధర్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు