'ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి’

25 Jan, 2014 00:47 IST|Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు పెంపుతో పాటు, 10వ పీఆర్సీ వేతన ఒప్పందాన్ని ప్రారంభ తేదీ నుంచే వర్తింప చేయాలని కోరారు. ఈ మేరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు దిగారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్, సీపీఐ నేత గుండా మల్లేష్, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు