త్వరలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతన పెంపు!

11 May, 2015 05:08 IST|Sakshi

- 50 శాతం పెంపునకు సుముఖత వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి


హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సుముఖత వ్యక్తం చేశారు. నాల్గోతరగతి ఉద్యోగాలను భర్తీ చేయకుండా గతంలో చంద్రబాబు ప్రభుత్వమే నిషేధం విధించింది. అప్పటి నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలోనే ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 65 వేలకు పైగా ఉన్నారు. వీరికిప్పుడు 50 శాతం పెంచినా.. ఒకే పనిచేసే ఔట్‌సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసం మాత్రం భారీగానే ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని మంత్రుల కమిటీ తేల్చింది. రెగ్యులర్‌గా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో మాత్రం 10 లేదా 15 శాతం వెయిటేజ్ ఇవ్వాలని చెప్పింది.

మరిన్ని వార్తలు