భలే చౌక విద్యుత్‌

2 Nov, 2019 04:15 IST|Sakshi

బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.3.15కే కొనుగోలు

ప్రతిరోజూ రూ.3 కోట్ల దాకా ఆదా 

థర్మల్‌ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుతున్న అధికారులు  

మార్కెట్‌లో ధర పెరిగినప్పుడు సొంత విద్యుత్‌ ఉత్పత్తి

గత ప్రభుత్వ హయాంలో యూనిట్‌కు రూ.6.56 చొప్పున చెల్లింపులు  

సాక్షి, అమరావతి:  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2018 అక్టోబర్‌ 4న ఒక్కో యూనిట్‌ కరెంటు కొనుగోలుకు ఎంత వెచ్చించారో తెలుసా? అక్షరాలా రూ.6.56. అప్పటి ప్రభుత్వ పెద్దలు అస్మదీయ విద్యుత్‌ సంస్థల నుంచే కరెంటు కొనేసి, విచ్చలవిడిగా దోచిపెట్టారు. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నా అటువైపు చూడలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 2019 అక్టోబర్‌ 4న యూనిట్‌ కేవలం రూ.3.38 చొప్పున అధికారులు కొన్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.18 చొప్పున మిగులుతోందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఏస్థాయిలో దోచేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

ఏపీ విద్యుత్‌ సంస్థలు(డిస్కమ్‌లు) కారుచౌకగా లభించే విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుని మరీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా యూనిట్‌ కరెంటును కేవలం రూ.3.15 చొప్పున కొనుగోలు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.4.50 పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో అంతకంటే చౌకగా లభిస్తున్న విద్యుత్‌ కొనుగోలుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ డిస్కమ్‌లు 12 మిలియన్‌ యూనిట్ల మేర చౌకైన విద్యుత్‌ తీసుకుంటున్నాయి. గతంలో ఇదే విద్యుత్‌ను యూనిట్‌ రూ.6.56 వరకూ చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర సగానికి సగం తగ్గడం వల్ల నిత్యం రూ.3 కోట్ల వరకూ ప్రజాధనం ఆదా అవుతుండడం గమనార్హం.  

బొగ్గు నిల్వల పెంపుపై దృష్టి   
థర్మల్‌ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్కెట్‌లో విద్యుత్‌ ధరలు పెరిగినప్పుడు ఈ బొగ్గు నిల్వలను ఉపయోగించుకుని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందో, ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ తగ్గినప్పుడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ ధరలు పడిపోతాయి. ఈ పరిస్థితిని ఏపీ డిస్కమ్‌లు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. తక్కువ ధరకే కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. ధర పెరిగినప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తోందని అధికారులు విశ్లేషించారు. 

గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.100 కోట్ల భారం  
ఏడాది క్రితం వరకూ విద్యుత్‌ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయాల్సి వచ్చేది. దీంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ లభ్యతపై అధికారులు అంచనాలు రూపొందించే అవకాశం చిక్కలేదు. ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు చెందిన ప్రైవేటు ప్లాంట్లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తక్కువ ధరకే విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు.

యూనిట్‌కు రూ.6.56 వరకూ వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా డిస్కమ్‌లపై నెలకు రూ.100 కోట్ల వరకూ భారం పడేది. అప్పటికీ, ఇప్పటికీ భారీ వ్యత్యాసం కనిపిస్తోందని విద్యుత్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 అక్టోబర్‌లో యూనిట్‌ రూ.5.99 చొప్పున 9.92 మిలియన్‌ యూనిట్ల కరెంటు కొన్నారు. 2019 అక్టోబర్‌ 1న 23.1 మిలియన్‌ యూనిట్లను యూనిట్‌ కేవలం రూ.3.38 చొప్పునే కొనుగోలు చేశారు. 2018 అక్టోబర్‌ 4న గరిష్టంగా యూనిట్‌ రూ.6.56 చొప్పున కొనగా, 2019 అక్టోబర్‌ 4న యూనిట్‌ కేవలం రూ.3.38 చొప్పున కొనుగోలు చేశారు. నవంబర్‌ 1వ తేదీ నాటికి దీన్ని రూ.3.15కు తగ్గించగలిగారు.  

మంచి ఫలితాలొస్తున్నాయ్‌  
‘‘చౌక విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ పడిపోయినప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న కరెంటు కొంటున్నాం. అదే సమయంలో థర్మల్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది’’ 
– శ్రీకాంత్‌ నాగులపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విస్తరిస్తున్న విశాఖ యాపిల్‌

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర

మిషన్‌–2021

కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తు

ఆరోగ్యమస్తు

‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’

‘తెలుగు మంత్రిగా నాపైనా ఆ బాధ‍్యత ఉంది’

‘దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించం’

‘కలిసి ముందుకు సాగుదాం.. అభివృద్ధి సాధిద్దాం’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ జీవోపై అసత్య ప్రచారం తగదు’

‘వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదు’

టీటీడీ వలలో పెద్ద దళారీ

విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ విచారణ షురూ

త్యాగ ధనులను స్మరించుకుందాం

‘మంత్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడను’

పోలవరం పనులు ప్రారంభించిన ‘మేఘా’

ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్‌

వికాస కేంద్రంగా విశాఖ

మామను అనాథాశ్రమంలో చేర్పించిన కోడలు..

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: అనిల్‌కుమార్‌

మావోల హింస వల్లే అత్యధిక ప్రాణనష్టం

మా రాష్ట్రం వాళ్లను బాగా చూసుకోండి: సీఎం జగన్‌

జర్నలిస్ట్‌ నుంచి ఈ స్థాయికి వచ్చాను: మంత్రి

'పొట్టి శ్రీరాములు చరిత్రను నలుదిశలా వ్యాపిస్తాం'

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

ఫైనాన్స్‌ కంపెనీ మోసం: 1600 మందికి పైగా డిపాజిటర్లు

ఏపీలో 13 జిల్లాలకు రూ.13 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ వ్యూహం?

ఇంకో పోలీస్‌ కావలెను!

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

తల్లీ కొడుకు

వాళ్లిద్దరి ప్రేమ

ఏజెంట్‌ మహా