పల్లెవించిన ప్రతిభ

21 Apr, 2016 00:54 IST|Sakshi

ప్రభుత్వ కళాశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు
‘కార్పొరేట్’కు దీటుగా మార్కులు
జిల్లాలో 17 మంది ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు 900కి పైనే మార్కులు

 

విజయవాడ : పల్లెల్లో విద్యాకుసుమాలు వికసించాయి. సాధారణ రైతు కుటుంబాలు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. పేదరికంలో పుట్టి కార్పొరేట్ చదువులు చదువుకోకున్నా  కార్పొరేట్‌కు విద్యార్థులకు దీటుగా, వారికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. విభిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థులు జిల్లాలోని జూనియర్ ఇంటర్ కళాశాలల్లో చదివారు. వారిలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు 17 మంది సత్తా చాటారు. ఈ ఏడాది వించిపేటలోని ఉర్దూ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత కనపరిచారు. పరీక్షకు 24 మంది హాజరైతే వారిలో 24 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో ముగ్గురు 900 మార్కులు సీఈసీ, హెచ్‌ఈసీ  లాంటి గ్రూప్‌లో సాధించడం విశేషం. జిల్లాలో ముఖ్యంగా కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నలుగురు, మొవ్వ కళాశాల విద్యార్థులు ఇద్దరు, నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల విద్యార్థులు ఏడుగురు,ఆగిరిపల్లి కళాశాల విద్యార్థి ఒకరు, వించిపేట కళాశాల విద్యార్థులు ముగ్గురు అత్యధిక మార్కులు సాధించారు.

 
సత్తాచాటింది వీరే..

కలిదిండి కళాశాలకు చెందిన సిహెచ్.లీల (ఎంపీసీ-973), కె.మమత ఇంటర్ మెదటి సంవత్సరంలో 453, నున్న హరిత (435), కె.మమత (430) మొవ్వ కళాశాలకు చెందిన సి.రాజేశ్వరి (933), ఓ.నాగమహేష్(908), విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు చెందిన నాగతేజ(972), జె.హిమజ (ఇంటర్ మొదటి సంవత్సరం-457), టి. శ్వేత (975), ఏ.పుష్పలత (481), సుశన (942), కె.పద్మావతి (929), ఎస్. విజయ్ (900), ఆగిరిపల్లి కళాశాలకు చెందిన సిహెచ్.పార్వతమ్మ (925), వించిపేట కళాశాలకు చెందిన షేక్ ఆయేషా (907), షరాఫ్ భాను(906), సయ్యద్ ఆరీఫా (902) మార్కులు సాధించారు.

మరిన్ని వార్తలు