శిథిలావస్థలో పోలీస్ స్టేషన్

9 Jun, 2017 14:25 IST|Sakshi
శిథిలావస్థలో పోలీస్ స్టేషన్
పాల్తూరు : అనంతపురం జిల్లాలోని పాల్తూరు పోలీస్‌ స్టేషన్‌ పూర్తిగా శిధిలావ్యస్థకు చేరింది. దశాబ్దాల కిందట నిర్మించి భవనం కావడంతో పోలీస్‌ స్టేషన్‌ పై కప్పు పెచ్చులూడి పడుతోంది. దీంతో ఏ సమయంలో పెచ్చులు ఊడతాయో, ఎప్పుడు పై కప్పు కూలుతోందని అని పోలీసులు తమ ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ఉద్యోగం చేయాల్సి వస్తోందని పోలీసులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రతి సంవత్సరం కూడా వర్షకాలంలో పోలీస్ స్టేషన్‌ అంతా కూడా వర్షం నీటితో కారుతోంది. దీంతో స్టేషన్‌కు సంబంధించి పలు రికార్డులు కూడా తడిసి ముద్దయిన సందర్బాలు కూడా లేక పోలేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్నోసార్లు తమ ఆవేదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్ళామని పోలీసులు వాపోతున్నారు. గత రెండు వారాలు కిందట మోహన్‌బాబు అనే కానిస్టేబుల్‌ రాత్రి సమయంలో స్టేషన్‌ సెంట్రీగా డ్యూటీ చేస్తుండగా పై కప్పు కూలీ కానిస్టేబుల్‌ తలపై పడటంతో తలకు తీవ్రంగా గాయమైంది. 
 
అంతే కాకుండా చెవి కూడా తెగి పోయిందని తోటి పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేషన్‌ పాత పడటంతో ఎప్పుడు కూలుతోందో ఎవరికి ఎవరి ప్రాణాలకు ముప్పుందో అని అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగం చేయాల్సి వస్తోంది. మొత్తం మీద స్టేషన్‌లో నాలుగు గదులు ఉండగా గదులన్నీ కూడా వర్షం వస్తే కారుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులకు రక్షణ లేదని రక్షక భటులు వాపోతున్నారు.
 
నూతన పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం ఎప్పుడో....!
దాదాపు రు.52 లక్షల రుపాయలతో పాల్తూరులో నూతనంగా పోలీస్‌స్టేషన్‌ నిర్మించారు. నిర్మాణం పనులు కూడా పూర్తి అయ్యాయి. రంగులువేశారు. స్టేషన్‌కు సబంధించి ఫర్నీఛర్స్‌ కూడా వచ్చాయి. స్టేషన్‌ ప్రారంభోత్సవమే తరువాయి. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు నూతన పోలీస్‌స్టేషన్‌ ప్రారంభోత్సవం చేయడంలో ఎందకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు.స్థానికంగా పాత పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగి పోవాలంటే తక్షణమే నూతన పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం చేస్తే పోలీసుల సమస్యలు తీరినట్లే.
 
మరిన్ని వార్తలు