పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి

16 Jun, 2017 02:32 IST|Sakshi
పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి

మరణానికి ఒక రోజు ముందు
సీవీసీకి పాల్వాయి లేఖ

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణ జరపాలన్నది ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చివరి కోరికగా మిగిలింది. పోలవరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వాటిపై సీవీసీ విచారణ జరిపి ప్రభుత్వ ధనాన్ని రాబట్టాలని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గత నెలలో సీవీసీకి పాల్వాయి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందిం చిన సీవీసీ.. ఫిర్యాదు తానే చేశానని ధ్రువీకరించా లని ఈ నెల 2న పాల్వాయికి లేఖ రాయగా.. తానే ఫిర్యాదు చేసినట్లు ధ్రువీకరిస్తూ మరణానికి ఒక రోజు ముందు సీవీసీకి మరో లేఖ రాశారు.

కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణ శాఖల అనుమతి లేకుం డా పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథ కాలు అక్రమంగా చేపట్టారని పాల్వా యి ఆరోపించారు. పట్టిసీమ కాంట్రా క్టర్‌కు రూ.400 కోట్లు ఎక్కువగా చెల్లించారని, ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నా రు. పోలవరానికి సంబంధించి టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ పద్ధతులు పాటించ లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి సరైన అనుమ తులు లేకుండా ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ. 41 వేల కోట్లకు పెంచారన్నారు.

పోలవరం కుడి కాలువ, పురుషోత్తపట్నం పథకాలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో వివక్షత ప్రదర్శించారన్నారు. ప్రాజెక్ట్‌ అక్రమాలు, అవినీతిపై పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, కాగ్‌ నివేదికను ఫిర్యాదుకు జతచేశారు. పోలవరం అవినీతిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఈఏ ఎస్‌ శర్మ ఇప్పటికే సీబీఐ, సీవీసీలకు ఫిర్యాదు చేశారని తెలిసిందని లేఖలో పాల్వాయి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు