23 పంచాయతీల్లో ముగిసిన ఎన్నికలు, 83.56 శాతం పోలింగ్ నమోదు

14 Aug, 2013 06:01 IST|Sakshi

వర్షం, వరదల కారణంగా వాయిదా పడ్డ పంచాయతీలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో వాయిదా పడ్డ 25 పంచాయతీల్లో మంగళవారం 23 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మరో రెండు పంచాయతీల్లో వర్షం కారణంగా వాయిదా పడ్డాయి. ఈనెల 22న వీటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వేమనపల్లి మండలం చామన్‌పల్లిలో కోర్టు ఉత్తర్వుల కారణంగా ఫలితం వెల్లడి కాలేదు. మిగిలిన 22 పంచాయతీల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన ఐదుగురు, కాంగ్రెస్ బలపరిచిన నలుగురు, టీడీపీ బలపరిచిన నలుగురు, వైఎస్సార్ సీపీ బలపరిచిన ముగ్గురు, స్వతంత్య్ర అభ్యర్థులు నలుగురు, జేఏసీ బలపర్చిన అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు.
 
83.56 శాతం పోలింగ్

జిల్లాలోని 23 గ్రామపంచాయతీల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహించగా సరాసరిన 83.56 పోలింగ్ శాతం నమోదైంది. బేల మండలం సాంగ్విలో 79.02 శాతం, బోథ్ మండలం బాబెర, కరత్వాడలో 88.05 శాతం, బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్‌లో 87.79 శాతం, ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడలో 82.92 శాతం, వేమన్‌పల్లి మండలం చామన్‌పల్లి, దస్నాపూర్‌లలో 88.15 శాతం, సిర్పూర్(టి) లోని డబ్బాలో 87.15 శాతం, కౌటాలలోని బాబసాగర్, గుడ్లబోరి, గంగాపూర్‌లో 87.35 శాతం, బెజ్జూర్‌లోని దింద, పెంచికల్‌పేట్, ఊటసారంగపల్లిలో 81.86 శాతం, కాగజ్‌నగర్‌లోని బారెగూడ, మాలిని, పోతపల్లి, వంజెరలో 79.72 శాతం, ఆసిఫాబాద్‌లోని మోవాడ్‌లో 85.6 శాతం, నార్నూర్‌లోని గాదెగూడ, పర్సువాడ(బి)లో 74.79 శాతం, వాంకిడిలోని కన్నెరగామలో 87.38 శాతం, తిర్యాణిలోని మంగిలో 76.15 శాతం పోలింగ్ నమోదైంది.కుశ్నపల్లి వాగు ఉప్పొంగడంతో గబ్బా యి గ్రామస్తులు, పాపన్‌పేట గ్రామపంచాయతీలోని కోమటిఒర్రె ఉప్పొంగడంతో సుశ్మీర్ గ్రామస్తులు ఓటును వినియోగించుకోలేకపోయారు. బెజ్జూర్ మండలంలో వాగులు ఉప్పొం గడంతో కుశ్నపెల్లి, పాపన్నపేటల్లో ఎన్నికలు వాయిదా వేశారు.
 
 ఫలితాలు ఇలా..
     వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కౌటాలలోని బాబాసాగర్‌లో సుశీల, గుడ్లబోరిలో భీమయ్య, కాగజ్‌నగర్ మండ లం బారెగూడలో విమల గెలుపొందారు.
 
     కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు కౌటాల మండలంలోని గంగాపూర్‌లో సిడం పెంటు, బెజ్జూర్ మండలంలోని ఊటసారంగాపూర్‌లో కొడిపే విశ్వేశ్వర్, కాగజ్‌నగర్ మండలంలోని వంజెరలో దుర్గం సంతోష్ విజయం సాధించారు.
 
     టీడీపీ బలపర్చిన అభ్యర్థులు బేల మండలంలోని సాంగ్విలో టేకం బాపురావు, బోథ్ మండలం బాబెరలో జాదవ్ యమునబాయి, ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌లో ఆత్రం లింగు, తిర్యాణి మండలం మంగిలో కొమురం దిన్‌కర్‌షాలు గెలుపొందారు.
 
     టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్‌లో మడావి రేణుకబాయి, బెజ్జూరు మండలంలో దిందాలో రసుల్‌బాయి, కాగజ్‌నగర్ మండలం మాలినీలో సిడాం భీంబాయి, నార్నూర్ మండలంలోని గాదెగూడలో కనక కౌసల్యబాయి, వేమనపెల్లి మండలం దస్నాపూర్‌లో వేపూరి శంకర్‌గౌడ్‌లు గెలుపొందారు.
 
     స్వతంత్ర అభ్యర్థులుగా బోథ్ మండలం కరత్వాడలో కొడప నగేష్, సిర్పూర్-టిలోని డబ్బాలో కొమురం రజిత, బెజ్జూరు మండలంలోని పెంచికల్‌పేటలో ఆత్రం సుగుణ, నార్నూర్ మండలంలోని  పర్సువాడ-బిలో సిడాం దేవురావులు గెలుపొందారు.
 
     జేఏసీ బలపర్చిన అభ్యర్థులు ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడలో ఇస్రుబాయి, కాగజ్‌నగర్ మండలంలోని పోతపల్లిలో బొట్లగుంట రాము గెలుపొందారు.

మరిన్ని వార్తలు