సమాంతర సామాజిక తనిఖీకి మంగళం

3 Feb, 2014 04:23 IST|Sakshi
  • గోడలపై నిలిచిపోయిన రాతల ప్రక్రియ
  •      లక్షలాది నిధులు దుర్వినియోగం
  •      ‘ఉపాధి హామీ’లో ఇష్టారాజ్యం
  •      సమగ్ర పారదర్శకత ఇక కరువే
  •  గజ్వేల్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించే ల క్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు అర్ధంతరంగా బ్రేక్ పడింది. ఆరు నెలలకోసారి చేపడుతున్న సామాజిక తనిఖీ ద్వారా అక్రమాల నివారణ సాధ్యం కావడం లేదనే భావనతో ప్రభుత్వం నెలకోసారి సమాంతర సామాజిక తనిఖీ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వడంలేదనే సాకు తో అధికారులు ఎత్తేసినట్లు తెలుస్తోది.  ఫలి తంగా అన్ని గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద గోడలపై రాసి నెలవారీ నివేదికలు పొందుపరచాల్సివుండగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
     
    జిల్లాలోని అయా మండలాల్లో సమాం తర సామాజిక తనిఖీ బాధ్యతలను గతంలో ఎంపీడీఓలు, ఉపాధి హామీ పథకం ఏపీడీ, ఏపీఓలకు అప్పగించారు. ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులపై ప్రతి ఆరు నెలలకోసారి సామాజిక తనిఖీలు జరుగుతుండగా దీనిద్వారా అక్రమాల నివారణ పూర్తిస్థాయిలో జరగడం లేదనే భావనతో కొత్తగా నెలకోసారి సమాంతర సామాజిక తనిఖీని చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రతి గ్రామంలో ప్రధాన కూడలి వద్ద గోడలను ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నెలవారీగా జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు, శ్రమశక్తి సం ఘాల వివరాలు, కూలీల వివరాలు, వేతనాల వివరాలు పారదర్శకంగా తెలియజేసే విధంగా పెయింటింగ్ చేస్తారు.

    ఏమైనా అక్రమాలు కనుక చోటు చేసుకుంటే కూలీలు అప్పటికప్పుడు అధికారులకు ఫిర్యా దు చేసి న్యాయం పొందవచ్చని ఈ తనిఖీ ఉద్దేశం. ఈ క్రమంలోనే జిల్లాలోని కొన్ని మం డలాల్లో 2012 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం జిల్లాలోని ఒక్కో మం డలానికి కొలతల రూపేణా లక్షల్లో నిధు లు వచ్చాయి. గోడలపై రాతల విషయంలో ఎక్క డా కూడా నిబంధనలు అమలు కాలేదు.

    ఎంపీడీఓలు స్థానికంగా అందుబాటులో ఉన్న ము గ్గురు నుంచి నలుగురు వరకు ఆర్టిస్టులను ఎం పిక  చేసుకొని వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేయాల్సివుండగా.. అసమగ్రంగా సాగింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, ములుగు, తూప్రాన్, జగదేవ్‌పూర్ మండలా ల్లో సమాంతర సామాజిక తనిఖీ ప్రక్రియ కా గా ఆయా గ్రామాల్లో పెయింటింగ్ వేసిన బో ర్డులపై ఇంకా శ్రమశక్తి సంఘాల పనుల విలువ, నెలరోజుల్లో వారికి చెల్లించిన వేతనాల మొత్తం వంటి వివరాలు ఇప్పటికీ నమోదు కాలేదు.
     
    ఆగిన ప్రక్రియ...
     
    ఉపాధి పనుల్లో పారదర్శకతను పెంపొందించాల్సిన వాల్‌రైటింగ్ ప్రక్రియలో నిబంధనలు అమలుకు నోచుకోక ఆర్టిస్టులతో కుమ్మక్కై మండలస్థాయి అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిని నివారించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సంబంధిత అధికారులు బాధ్యతను మరిచి... లక్ష్యం నెరవేరడంలేదనే సాకుతో అర్ధంతరంగా నిలిపివేశారు. అందువల్లే రెండేళ్లుగా గ్రామాల్లో సమాంతర సామాజిక తనిఖీ వాల్‌రైటింగ్స్ గ్రామాల్లో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
     
     ఉన్నతస్థాయి సమీక్షలో వివరాలు తెలుస్తాయి...

     
    సమాంతర సామాజికి తనిఖీ వ్యవహారం రెండేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉంది. ఇకముందు ఉంటుందా? లేదా? అనే విషయం కొద్దిరోజుల్లో ఉన్నతస్థాయిలో నిర్వహించనున్న సమీక్షలో తేలనుంది. జిల్లాలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
     -హరినాథ్‌బాబు, ఉపాధిహామీ పథకం
     జిల్లా అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్

     

మరిన్ని వార్తలు