మా కుమారుడి ఆచూకీ తెలపండి

26 May, 2020 12:59 IST|Sakshi

దంపతుల వేడుకోలు

వైఎస్‌ఆర్‌ జిల్లా,జమ్మలమడుగు రూరల్‌:  ఈనెల 16న తమ కుమారుడు కులాయి స్వామిని తెలంగాణ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని ఇంత వరకు మా కుమారుడి ఆచూకీ తెలుపలేదని మైలవరం మండలం చిన్నవెంతుర్ల గ్రామానికి చెందిన రాజన్న, పుష్పావతి దంపతులు ఆవేదన చెందారు. ఈ మేరకు వారు సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్, మానవహక్కుల కమిషన్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మెయిల్‌ ద్వాలా పిటిషన్‌ పంపించారు. హైదరాబాద్‌లోని మాదాపురం పోలీసులు తమ కుమారుడిని అదుపులోకి తీసుకుని 9 రోజులు దాటినప్పటికీ తమకు గాని, తలమంచిపట్నం పోలీసులకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. తాము కేవలం దళితులమని.. దిక్కులేని వారమనే  తెలంగాణ పోలీసులు ఇలా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నరని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు