వీఐపీలకు పాసుల కేటాయింపు

29 May, 2019 20:10 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. దీని కోసం స్టేడియం లోపల, పరిసర ప్రాంతాలు, వచ్చే మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్‌ సర్వీస్‌ అధికారులు, ఇతర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాధికారులు ఐదు రకాల పాసులను ప్రముఖులకు జారీ చేశారు.

పాసులు
ఏఏ పాస్‌లు-350 జారీ(జ్యుడీషియరీ, సమాచార కమిషనర్లు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు)
ఏ1 పాస్‌లు-500 జారీ(ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకి ఇచ్చారు)
ఏ2 పాస్‌లు-800 జారీ(ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబసభ్యులు)
బీ1 పాస్‌లు-500 జారీ(ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు)
బీ2 పాస్‌లు- 500 జారీ(బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఇతర అధికారులు)

స్టేడియం లోపలికి రావడానికి ఆరు గేట్ల ఏర్పాటు

గేట్‌1(మొయిన్‌ గేట్‌)- గవర్నర్‌, తెలుగు రాష్ట్రాల సీఎంలు, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌)
గేట్‌2- వీఐపీలు(ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్‌ అధికారులు, జ్యుడీషియరీ, మీడియా ప్రతినిధులు)
గేట్‌3, గేట్‌6లలో పాస్‌లు ఉన్నవారికి ప్రవేశం
గేట్‌4, గేట్‌5లలో సాధారణ ప్రజలకు ప్రవేశం
 

మరిన్ని వార్తలు