పింఛన్ల పరిహాసం

3 Feb, 2019 13:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ పేరుతో లబ్ధిదారులను టీడీపీ నేతలు పరిహాసం చేశారు. ప్రభుత్వ సొమ్మును తమ జేబులో నుంచి తీసి ఇస్తున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు. వృద్ధులను, వికలాంగులను గంటల తరబడి వేచి ఉండేలా చేసి, తమ దయాదాక్షిణ్యం అన్నట్టుగా పంపిణీ చేశా రు. ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. ముడుపులకు కక్కుర్తి పడిన జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు ఇదే అ వకాశంగా చెలరేగి పోయారు. ఎప్పటి మాదిరిగానే పింఛ న్ల లబ్ధిదారుల నుం చి చేతివాటం ప్రదర్శించారు. ఒక్కొక్కరి వద్ద రూ.200 నుంచి రూ.500 వరకూ కమీషన్లు వసూలు చేశారు.

కాకినాడ సిటీలోనైతే బాధిత పింఛన్‌దారులు మీడియా ముందుకొచ్చి తమ గోడు బహిరంగంగా చెప్పారు. జన్మభూమి కమిటీ సభ్యురాలు జగదాంబ తమ నుంచి రూ.రెండేసి వందల చొప్పున తీసుకున్నారని లబ్ధిదారులు వరుసగా నిలబడి బాహాటంగానే చెప్పారు. ఇదే తరహాలో జిల్లాలోని మిగతాచోట్ల కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పింఛన్‌ ఇస్తున్నామని.. ఇదంతా తమ చలవేనని.. ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నాయకులు వసూళ్లకు దిగారు.కాకినాడ కార్పొరేషన్‌ పరిధి 24వ డివిజన్‌ ముగ్గుపేటలో పింఛన్‌ లబ్ధిదారుల వద్ద స్థానిక టీడీపీ నేత, జన్మభూమి కమిటీ సభ్యురాలు గుత్తుల జగదాంబ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున వసూలు చేశారని లబ్ధిదారులు చెప్పారు.

  •  కాకినాడ రూరల్‌ నేమాం గ్రామంలో పసుపు–కుంకుమ చెక్కులను యానిమేటర్‌ గంగాభవాని తనతో తీసుకువెళ్లిపోవడంపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయించారు. ఎంతకీ చెక్కులు ఇవ్వకపోవడంతో 1100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యానిమేటర్‌ నుంచి చెక్కులు తీసుకుని పంపిణీ చేయాలని ఆదేశించారు. డ్వాక్రా రుణాలు మంజూరు చేసినప్పుడు రూ.లక్షకు రూ.5 వేల చొప్పున తీసుకుంటున్నారని ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారన్న అక్కసుతోనే గంగాభవాని చెక్కులు పంపిణీ చేయకుండా తనతో తీసుకువెళ్లిపోయారని మహిళలు ఆరోపించారు.
     
  • అల్లవరం మండలం ఎంట్రుకోనలో పసుపు– కుంకుమ పథకంపై మాట్లాడమని ఓ మహిళకు మైకు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేస్తామన్న జాబితాలో తన పేరు ఉన్నా రుణమాఫీ కాలేదని చెప్పింది. రూ.లక్షన్నర అప్పు ఉంటే బంగారం అమ్మి రూ.2.50 లక్షలు వడ్డీ సహా చెల్లించానని చెప్పడంతో టీడీపీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు.
     
  • పిఠాపురం నియోజకవర్గంలోని పలుచోట్ల ‘‘ఇదిగో ఈ మూడు వేలు నీకు తీసుకో. చంద్రబాబు ఇస్తున్నారు. ఆయనకే ఓటు వెయ్యి’’ అంటూ టీడీపీ నాయకులు పసుపు–కుంకుమ, పింఛన్ల పంపిణీ గ్రామసభలను ఓట్ల కొనుగోలు సభల్లా మార్చేశారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ వచ్చేలోగా లబ్ధిదారులు వెళ్లిపోకుండా ఉండేందుకు వారి పాస్‌ పుస్తకాలు లాక్కున్నారు.
     
  • గండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో దివ్యాంగులకు జనవరిలో పెంచిన రూ.1,500, ఫిబ్రవరిలో రూ.3 వేలు కలిపి రూ.4,500 ఇవ్వాల్సి ఉండగా పుస్తకంలో అంతే మొత్తం నమోదు చేశారు. లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. కొత్త పింఛనుదారులకు రూ.3 వేలకు బదులు రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని పలువురు ఆరోపించారు. అధికారులు లేకుండా అధికార పార్టీ కార్యకర్తలే లబ్ధిదారులకు సొమ్ములు ఇచ్చి, సంతకాలు చేయించుకుని, వేలిముద్రలు వేయించుకున్నారు.
     
  • ఇంకా పలుచోట్ల పదవుల్లో లేని టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్మును తమ సొంత నగదులా పంపిణీ చేశారు. ఇదంతా తమ సొమ్మని, చంద్రబాబుకు ఓటెయ్యకపోతే తీసేస్తామని కొన్నిచోట్ల బెదిరింపులకు దిగారు. రాజమహేంద్రవరం నగరం హరిపురంలో పసుపు–కుంకుమ సొమ్ములు ఇచ్చి, టీడీపీకే ఓట్లు వేయాలని ఒట్లు వేయించుకోవడంతో ప్రజలు విస్తుపోయారు.
మరిన్ని వార్తలు