నేరం కాంగ్రెస్‌పై నెట్టేస్తున్నాయి

9 Aug, 2015 02:58 IST|Sakshi
నేరం కాంగ్రెస్‌పై నెట్టేస్తున్నాయి

♦ కాంగ్రెస్ నేతలు రఘువీరా, చిరంజీవి
♦ ఏపీకి రూ. 24,350 కోట్లు నిధులు ఇవ్వాలి
 
 తిరుపతి గాంధీరోడ్డు : రాష్ట్రాన్ని విడదీసేందుకు నాడు అన్ని పార్టీలు సంతకాలు పెట్టి, తామేమీ చేయలేదని ఇప్పుడు నేరం కాంగ్రెస్‌పై నె ట్టేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. శనివారం తిరుపతిలో ఏర్పా టు చేసిన పోరుసభలో వారు మాట్లాడా రు. నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కా వాలని గొంతు చించుకున్న నేతల ఆవే శం ఈ రోజు ఎక్కడికి పోయిందని ప్ర శ్నిం చారు. అధికారంలోకి వచ్చాక ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒక లాగా మా ట్లాడడం మంచిదికాదన్నారు.

చంద్రబా బు మోదీ చేతిలో కీలుబొమ్మ లా మారారని విమర్శించారు. మాట్లాడితే డబ్బు లు లేవు, లేవని బాబు బీద అరుపులు అరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉ న్నంతవరకు రాష్ట్రానికి అలాంటి పరిస్థితి రాదన్నారు. బీజేపీ, టీడీపీలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలన్నారు. మోదీ ఒక మౌన ముని అని, ఏపీ గురిం చి నోరు మెదపకుండా దాటేస్తున్నారన్నా రు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రూ.24,350 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విదేశాల్లో దేశం పరువును కాపాడాల్సిన మోదీ దేశప్రతిష్టకు భంగం కలిగేలా మా ట్లాడుతున్నారన్నారు. ఇండియా స్కా మ్‌ల దేశమని, విదేశాల్లో ప్రచారం చేస్తే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఎవ రు ముందు కు వస్తారని ప్రశ్నించారు. స్వచ్ఛభారత్ అని నెత్తిన తెల్ల టోపీ పెట్టుకుని, చేతిలో చీపుర పట్టుకుని ఒకరోజు ఊడ్చితే సరి పోతుందని ప్రశ్నించారు. బలి దానానికి సిద్ధపడిన మునికోటి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుని, రూ.2 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారు. ఆయనకు కావాల్సిన అన్నిరకాల వైద్య సేవలను చేయిస్తామన్నారు.  డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి అశోక్ సామ్రాట్ యాదవ్, నగర అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు