‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

24 Feb, 2017 02:04 IST|Sakshi
‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి బృందం  

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కుంభకోణం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షు డు ఎన్‌.రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృం దం గురువారం గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా అనంత పురం జిల్లా దుద్దేబండలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, నాయకులు మాదాసు గంగాధరం, ఎన్‌.తులసిరెడ్డి, సుందరరామ శర్మ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు